ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాల మధ్య కేంద్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అయితే ఏం రంగానికి ఎంత కేటాయించారు? ప్రభుత్వానికి అత్యధిక ఆదాయ వనరు ఏంటి? ప్రభుత్వం ఎక్కువగా ఏ రంగంపై ఖర్చు చేయబోతోంది? వంటి విషయాలను అంకెల రూపంలో తెలుసుకుందాం.
ఆదాయం ఇలా..
- ప్రతి రూపాయిలో 53 పైసలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా వస్తుంది
- 36 పైసలు.. అప్పులు, ఇతర రుణాలు
- పెట్టుబడుల ఉపసంహరణ సహా పన్నుయేతర ఆదాయం ద్వారా 6 పైసలు
- 5 పైసలు.. రుణ యేతర మూలధనం ద్వారా
- ఇదీ చూడండి: నిర్మలమ్మ '2021 బడ్జెట్' హైలైట్స్ ఇవే...
తెలుసా..
- ప్రతి రూపాయిలో 15 పైసలు జీఎస్టీ రూపంలోనే వస్తుంది.
- కార్పొరేషన్ పన్నుల ద్వారా 13 పైసలు చేరుతోంది.
- కేంద్ర ఎక్సైజ్ సుంకం రూపంలో 8 పైసలు, కస్టమ్స్ సుంకం ద్వారా 3 పైసలు వసూలు చేయనుంది.
- 14 పైసలు ఆదాయ పన్ను రూపేణా వస్తుంది.
ఖర్చు ఇలా...
- ప్రతి రూపాయికి 20 పైసల చొప్పున వడ్డీ చెల్లింపులు. ఇదే అతిపెద్ద వ్యయం.
- రాష్ట్రాల పన్నులు, సుంకాల వాటా 16 పైసలు.
- ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో 8 పైసలు రక్షణ శాఖకు.
- కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలకు 14 పైసలు.
- కేంద్ర ప్రాయోజిత పథకాలకు 9 పైసలు.
- ఫైనాన్స్ కమిషన్, ఇతర లావాదేవీలకు 10 పైసలు.
- రాయితీలు, పింఛనులకు వరుసగా 8, 5 పైసలు.
- ఇతర ఖర్చులకు 10 పైసలు.
- ఇదీ చూడండి: పద్దు: ఆరోగ్యం, మౌలిక వసతులకే ప్రాధాన్యం
అంకెల రూపంలో బడ్జెట్..
మొత్తం బడ్జెట్: రూ.34.83 లక్షల కోట్లు
- ఆరోగ్య సంరక్షణపై పెట్టే ఖర్చును ఈ బడ్జెట్లో 137 శాతం పెంచారు.
- ఆత్మనిర్బర్ ఆరోగ్య పథకానికి మొత్తం రూ.2,23,846 కోట్లు.
- రూ. 64,180 కోట్లతో ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ స్వస్త్ యోజన.
- రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87వేల కోట్లు.
- స్వచ్ఛభారత్ మిషన్‌కు రూ.లక్షా 41వేల 678 కోట్లు.
- కొవిడ్ టీకా కోసం రూ. 35 వేల కోట్లు.
- రైల్వేలకు లక్షా 10 వేల 55 కోట్లు.
- 4 వేల 378 పట్టణ స్థానిక సంస్థలకు జలజీవన్ మిషన్ కింద రూ.2 లక్షల 87 వేల లక్షల కోట్లు.
- స్వచ్ఛ భారత్ కోసం రూ. లక్షా 41 వేల 678 కోట్లు.
- గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.40 వేల కోట్లు.
- వ్యవసాయంలో మౌలిక వసతుల కల్పనకు రూ.40 వేల కోట్లు.
- బీమా రంగంలో ప్రస్తుతం 49 శాతంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితి 74 శాతానికి పెంపు.
- వచ్చే ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌యూ బ్యాంక్‌లకు రూ. 20వేల కోట్లతో మూలధన సహాయం.
- రూ. 20 వేల కోట్ల వ్యయంతో అభివృద్ధి ఆర్థిక సంస్థను ఏర్పాటు చేసే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
- ఆహారం, ఎరువులు, ఎల్‌పీజీ, కిరోసిన్లపై ప్రభుత్వ రాయితీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5.96 లక్షల కోట్లు.
- వచ్చే ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయం 5.54 లక్షల కోట్లకు పెంచారు. ఇది గత ఆర్థిక సంవత్సరంలో రూ. 4.39 లక్షల కోట్లుగా ఉంది.
- దేశంలోనే మొదటి డిజిటల్ జనాభా లెక్కల కోసం రూ.3,726 కోట్లు.
- 2021-22లో ప్రభుత్వం మార్కెట్ నుంచి రూ.12.05 లక్షల కోట్ల రుణం తీసుకోనుంది. ఇది అంచనా వేసిన రుణం కన్నా 64 శాతం ఎక్కువ.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన రూ.12.8 లక్షల కోట్ల కన్నా ఇది తక్కువ.
- వచ్చే ఆర్థిక సంవత్సరంలో గత రుణాలకు చెల్లింపు కోసం రూ.2.80 లక్షల కోట్లు కేటాయించారు.
- కరోనా వైరస్‌పై పోరాటం కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి తీసుకునే రుణాలను 50 శాతానికి పైగా పెంచింది.