ETV Bharat / business

' 'స్క్రాపింగ్​ పాలసీ'తో ఆటోమొబైల్​ రంగానికి ఊతం' - బడ్జెట్​ 2021-22

లోక్​సభ వేదికగా బడ్జెట్​ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​.. పాత, వినియోగానికి పనికిరాని వాహనాలకు స్క్రాపింగ్​ విధానాన్ని ప్రకటించారు. వ్యక్తిగత వాహనాలు 20ఏళ్లు, వాణిజ్యపరమైన వాహనాలకు 15ఏళ్లు నిండిన తర్వాత అవి ఫిట్​నెస్​ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు.

FM announces voluntary vehicle scrapping policy to phase out old vehicles
పాత వాహనాల తొలగింపునకు 'స్క్రాపింగ్​ పాలసీ'
author img

By

Published : Feb 1, 2021, 12:04 PM IST

Updated : Feb 1, 2021, 12:28 PM IST

పాత, వినియోగానికి పనికిరాని వాహనాలను దశలవారీగా తగ్గించేందుకు వాలంటరీ 'స్క్రాపింగ్​ పాలసీ'ని ప్రకటించారు కేంద్ర ఆరోగ్యమంత్రి నిర్మలా సీతారామన్​. వ్యక్తిగత వాహనాలకు 20ఏళ్లు, వాణిజ్యపరమైన వాహనాలకు 15ఏళ్లు గడిచిన అనంతరం ఫిట్​నెస్​ పరీక్షలు జరిపించాలని స్పష్టం చేశారు. ఇది వాహన ఉత్పత్తి రంగానికి ఊతం అందిస్తుందని పేర్కొన్నారు.

లోక్​సభలో సోమవారం బడ్జెట్​ను ప్రవేశపెట్టారు నిర్మల. ఈ స్క్రాపింగ్​ విధానం వల్ల ఇంధన సామర్థ్యం పెరుగుతుందన్నారు. పర్యావరణహిత వాహనాల సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు.

ఈ స్క్రాపింగ్​ విధానంపై గత వారంలోనే సంకేతాలిచ్చారు కేంద్ర రవాణామంత్రి నితిన్​ గడ్కరీ. 2022 ఏప్రిల్​ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశముందన్నారు.

ఇదీ చూడండి:- 'ఆరు కీలక అంశాల ఆధారంగా బడ్జెట్​ ప్రతిపాదనలు'

Last Updated : Feb 1, 2021, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.