ETV Bharat / business

రిటర్నులు సులువుగా దాఖలు చేయండిలా... - ప్రభుత్వం

ఐటీ రిటర్నులు... చాలా క్షిష్టమైన ప్రక్రియ అని భావిస్తుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ అభిప్రాయం వాస్తవమే. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం ఈ ప్రక్రియను చాలా సులభతరం చేసింది.

ఐటీ రిటర్నులు సులువుగా దాఖలు చేయండిలా..
author img

By

Published : Apr 14, 2019, 10:31 AM IST

ఒకప్పుడు ఐటీ రిటర్నులు(ఐటీఆర్​) దాఖలు చేయటం అనేది ఓ పెద్ద ప్రక్రియ. ధ్రువీకరణ పత్రాలు, రసీదులు తదితరాలను భౌతికంగా సమర్పించాల్సి ఉండేది. వెరిఫికేషన్​కు చాలా సమయం పట్టేది. రిటర్నులు ఖాతాలో కొన్ని నెలల తరవాత జమ అయ్యేవి. కానీ ఇప్పుడు ఈ పద్ధతి అంతా మారిపోయింది. దాఖలు నుంచి ఖాతాలో జమ వరకు ప్రభుత్వం సులభమైన, వేగవంతమైన పద్ధతి ప్రవేశపెట్టింది.

మొత్తం ఆన్​లైనే...

ఇప్పుడు భౌతిక ప్రక్రియకు ఆదాయపు పన్ను విభాగం స్వస్తి పలికింది. 80 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు మాత్రమే ఆఫ్​లైన్​ ద్వారా సమర్పించవచ్చు. మిగతా వారు తప్పనిసరిగా అంతర్జాలాన్నే అశ్రయించాల్సి ఉంటుంది.

వెరిఫికేషన్​కూ అంతర్జాలమే...

వెరిఫికేషన్​ అనగా మనం సమర్పించిన వివరాలు, పత్రాల తనిఖీ. ఐటీ రిటర్నులు పొందటానికి ఇదే చివరి ప్రక్రియ.

కొంతకాలం క్రితం అంతర్జాలంలో రిటర్నులు దాఖలు చేసినప్పటికీ... ఫామ్​ను ప్రింట్​ తీసుకొని సంతకం చేసి ఆదాయపు పన్ను విభాగంలోని కేంద్ర ప్రాసెసింగ్​ సెంటర్​కు పంపించాల్సి ఉండేది. ఈ పద్ధతిని సులభతరం చేస్తూ ఈ-వెరిఫికేషన్​ను తీసుకొచ్చింది ఐటీ శాఖ.

ఇందుకోసం ఈ-వెరిఫికేషన్​ సేవలు అందించే బ్యాంకు ఖాతా ఉండాలి. మీరు ఇంటర్నెట్​ బ్యాంకింగ్​ లాంటి సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. ఆధార్​ ద్వారా వెరిఫై చేసుకోవటం మరో పద్ధతి. మీ ఆధార్​తో ఫోన్​ నంబరు అనుసంధానం అయి ఉండాలి.

ఇదీ పద్ధతి...

ఐటీ రిటర్నులు దాఖలు కోసం మొదట పన్ను చెల్లింపుదారుగా నమోదుకావాలి. ఐటీఆర్​ వెబ్​సైట్​లోనే ఈ సదుపాయం ఉంటుంది. ఇంతకుముందే మీరు ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లయితే సైన్​ఇన్​ అయి ఫైలింగ్​ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

ఇలా దాఖలు చేయండి...

1) ఆదాయపు పన్ను వెబ్​సైట్​లోకి వెళ్లండి. పైన కుడి వైపు ఉన్న లాగిన్​ను క్లిక్​ చేసి పాన్​కార్డు సంఖ్య, పాస్​వర్డ్​తో లాగిన్​ అవ్వండి. అప్పుడు మీకు డ్యాష్​బోర్డు పేజీ తెరపై కనబడుతుంది. ఐటీ రిటర్న్​ ఫైలింగ్​, సమర్పించిన రిటర్నులు చూసుకొనేందుకు ఇక్కడ వీలుంటుంది.

ITR, E-Filing, India, Individual, ITR, IT Returns,  Income tax, Government
ఆదాయపు పన్ను రిటర్నులు

2) 'ఫిల్లింగ్​ ఆఫ్​ ఇన్​కమ్​ ట్యాక్స్​ రిటర్న్​'పై క్లిక్​ చేయండి. అనంతరం పాన్​ నంబరు, అసెస్​మెంట్​ ఏడాది(మీరు ఫైలింగ్​ చేస్తున్న సంవత్సరం) నమోదు చేయండి. మీ అర్హతకు అనుగుణంగా ఐటీఆర్​ దరఖాస్తు 1, 2, 3లలో ఏదో ఒకదానిని ఎంచుకోవాలి. మొదటిసారి సమర్పించినట్లయితే ఒరిజినల్​, ఇంతకుముందు సమర్పించిన వాటిని సవరించాలంటే రివైజ్డ్​లను ఎంచుకోవాలి.

3) గతసారి వెరిఫై అయిన ఐటీఆర్​ దరఖాస్తు నుంచి ఉద్యోగం రకం, ఇంటి వివరాలు, బ్యాంకు వివరాలు, సెక్షన్​ 89 ప్రకారం పన్ను మినహాయింపు లాంటి వివరాలను నింపుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని వివరాలు సమర్పించవచ్చు.

4) ఈ స్టెప్​లో ఆదాయపు పన్ను గణన, పన్ను సమాచారం, చెల్లించిన పన్ను, విరాళాలు(సెక్షన్​ 80జీ, సెక్షన్​ 80జీజీఏ) లాంటి వివరాలు నింపుకోవాలి. అనంతరం ఐటీఆర్​ను సమర్పించాలి.

ఇలా రిజిస్టర్​ అవ్వండి...

1) ఐటీఆర్​ వెబ్​సైట్​లో పైన కుడివైపులో ఉన్న 'రిజిస్టర్​ యువర్​సెల్ఫ్​' అనే దానిని క్లిక్​ చేయండి.

రిజిస్ట్రేషన్​​

2) తదుపరి స్టెప్​లో వ్యక్తిగతం, హిందూ ఉమ్మడి కుటుంబం లాంటి వాటిలో మీకు తగిన ఆప్షన్​ ఎంచుకోవాలి.

3) ఈ స్టెప్​లో పాన్​ సంఖ్య, పేరు, పుట్టిన తేదీ లాంటివి నింపి కంటిన్యూ క్లిక్​ చేయండి.

4) ఇందులో ఫోన్​ నంబరు, చిరునామా, మెయిల్​ ఐడీ, ఫోన్​ నంబరుతో పాటు రెండు సెక్యూరిటీ ప్రశ్నలకు సంబంధించిన వివరాలు నింపాలి.

5) ఈమెయిల్​ ఐడీ, ఫోన్​ నంబరును ఓటీపీతో వెరిఫై చేసుకుంటే రిజస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఈమెయిల్​కు యూజర్​ ఐడీ వివరాలు వస్తాయి.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.