గోల్డ్ బాండ్ల పథకంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఆన్లైన్లో ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని డిజిటల్ రూపంలో చెల్లింపులు జరిపేవారికి గ్రాము బంగారంపై రూ.50 తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపింది.
సబ్స్క్రిప్షన్ తేదీల్లో డిజిటల్ చెల్లింపు చేసే వారికి గోల్డ్ బాండ్ ఇష్యూ ధర రూ.5,054గా నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇతరులు రూ.5,104 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
సౌర్వభౌమ పసిడి బాండ్లు 2020-21 (సిరీస్ X) జనవరి 11-15 వరకు సబ్స్క్రిప్షన్ కోసం తెరచి ఉంటాయి. జనవరి 19 వీటికి సెటిల్మెంట్ తేదీ.
ఇదీ చూడండి:ఆర్థిక గణాంకాలు, క్యూ3 ఫలితాలే మార్కెట్లకు కీలకం!