ETV Bharat / business

కరోనా 2.0తో దేశార్థికం రిక'వర్రీ'!

దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభణ తీవ్రరూపం దాలుస్తోంది. ఒక్క రోజులో మళ్లీ 35 వేలకుపైగా కేసులు నమోదవడం చూస్తే కరోనా తీవ్రత ఏ స్థాయిలో పెరుగుతుందో అర్థమవుతోంది. ఈ కారణంగా ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్​ సహా పలు రాష్ట్రాలు మళ్లీ కొవిడ్ ఆంక్షలు విధిస్తున్నాయి. పరిస్థితి మళ్లీ ఇలానే కొనసాగితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ మరింత పతనమయ్యే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు.

author img

By

Published : Mar 18, 2021, 5:04 PM IST

covid vaccination will only help economy
దేశార్థికానికి కరోనా రెండో దశ దెబ్బ

కరోనా వల్ల గత ఏడాది తీవ్రంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్నట్లు ఇటీవల సంకేతాలొచ్చాయి. కొవిడ్ సంక్షోభం తర్వాత తొలిసారి వృద్ధి రేటు 2020-21 అక్టోబర్​-డిసెంబర్ త్రైమాసికంలో సానుకూలంగా (0.4 శాతంగా) నమోదైనట్లు తేలడం ఇందుకు నిదర్శనం. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం, చాలా రాష్ట్రాలు లాక్​డౌన్​, కర్ఫ్యూ విధిస్తుండటం వల్ల ఆర్థిక వ్యవస్థపై మళ్లీ ఆందోళనలు తీవ్రమవుతున్నాయి.

వ్యాపారాలపై ప్రభావం..

కొవిడ్‌-19 తీవ్రతతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరైన మహారాష్ట్ర మరోసారి కరోనా విలయాన్ని చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకుంటున్న అక్కడి ప్రభుత్వం.. అమరావతి, నాగ్‌పుర్‌ నగరాల్లో పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. ఇక పుణె, నాసిక్‌, ఔరంగాబాద్‌ నగరాల్లో పాక్షిక లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తోంది.

డైనింగ్​పై​ పూర్తి నిషేధం, పార్సిల్​పైనా ఆంక్షల కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది.

గుజరాత్‌లోని.. అహ్మదాబాద్‌, వడోదర, సూరత్‌, రాజ్‌కోట్‌ నగరాల్లో మార్చి 31వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దీనితో పాటు మధ్యప్రదేశ్​లోనూ పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కరోనా తీవ్రత ఉన్నట్లు తేలిన తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల దిశగా అడుగులు వేస్తుండటం వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

సప్లయ్​ చైన్​పై ప్రభావం..

అయితే కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ దేశవ్యాప్త లాక్​డౌన్ విధిస్తారా? అనే విషయంపై కేంద్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్​ వంటి రాష్ట్రాల్లో ఆంక్షల వల్ల దేశవ్యాప్తంగా సప్లయ్ చైన్​ దెబ్బతింటుందంటున్నారు నిపుణులు.

'రికవరీ దశలో హై ఫ్రీక్వెన్సీ డేటా ఇప్పుడిప్పుడే సానుకూలంగా నమోదవుతోంది. అయితే కరోనా కేసుల్లో పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని మరోసారి అంక్షలు అమలు చేయడం వల్ల.. రికవరీలో కొంత ఒడుదొడుకులు ఎదురయ్యే అవకాశముంది' అని యాక్సిస్​ క్యాపిటల్​ లిమిటెడ్​ ముఖ్య ఆర్థికవేత్త పృథ్వీరాజ్​ శ్రీనివాస్ 'ఈటీవీ భారత్​'తో అన్నారు.

కేసుల్లో పెరుగుదల కారణండా మళ్లీ చాలా మంది ఆదాయం కోల్పోవచ్చని అంచనా వేశారు. "ఏడాది క్రితం కరోనా వ్యాప్తికి, ఇప్పుడు మరోసారి వైరస్ విజృంభించడానికి మధ్య ఓ వ్యత్యాసం ఉంది. అప్పుడు ఆదాయంతోపాటు డిమాండ్ భారీగా తగ్గింది. అయితే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెటలో కమొడిటీల ధరలు తిరిగి గణనీయంగా పుంజుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజల ఆదాయం తగ్గిపోతే డిమాండ్​ వృద్ధిపై మళ్లీ ప్రతికూల ప్రభావం పడుతుంది" అని వివరించారు పృథ్వీరాజ్.

2020 ఏప్రిల్​లో డిమాండ్​ లేమి కారణంగా.. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 19 డాలర్లకు పడిపోయింది. అదే ప్రస్తుతం 68 డాలర్లకు తిరిగి పుంజుకుంది. ఈ కారణంగా భారత్​లో పెట్రోల్​, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి.

ఇంకా చెప్పాలంటే దేశంలో పెట్రోల్​, డీజిల్ ధరలు ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఉన్నాయి. రాజస్థాన్​లోని పలు ప్రాంతాల్లో ఇప్పిటికే లీటర్​ పెట్రోల్ ధర రూ.100 దాటింది. మిగతా అన్ని రాష్ట్రాల్లో లీటర్​ పెట్రోల్ రూ.90పైనే ఉంది. డీజిల్ ధర కూడా లీటర్​కు రూ.90కి చేరువలో ఉంది.

నిరుద్యోగ సమస్య..

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎంఐఈ) డేటా ప్రకారం.. దేశంలో నిరుద్యోగ రేటు ఆరు నెలల కనిష్ఠానికి చేరింది. గత ఏడాది డిసెంబర్​లో 9.06 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. జనవరిలో 6.53 శాతానికి దిగొచ్చింది. అయితే ఫిబ్రవరిలో మళ్లీ 0.37 శాతం పెరిగి.. 6.90 శాతానికి చేరింది.

మళ్లీ లాక్​డౌన్​ సహా ఆంక్షల విధింపు కారణంగా నిరుద్యోగ సమస్య తీవ్రమయ్యే ప్రమాదముందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా అసంఘటిత రంగాల్లోని కార్మికులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని అంటున్నారు.

"మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థకు కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీనివల్ల అసమానతలు భారీగా పెరగొచ్చు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూలీ పని చేసే వారి రోజువారీ వేతనాలు, ఒంటరి మహిళలు, వృద్ధులపై ప్రభుత్వం దృష్టి సారించాలి." అని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్​, స్కూల్​ ఆఫ్​ ఎకనామిక్స్ అసిస్టెంట్​ ప్రొఫెసర్​ డాక్టర్​ కృష్ణా రెడ్డి 'ఈటీవీ భారత్​'తో అన్నారు.

వ్యాక్సినేషన్​తోనే చెక్​..

మరోసారి వేగంగా కరోనా కోరలు చాస్తున్నందున వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ప్రస్తుతం కరోనా టీకా హెల్త్​కేర్​, ఫ్లంట్​లైన్ వర్కర్లు, 60 ఏళ్లుపైబడిన వారికి మాత్రమే ఇస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా 90 శాతం జనాభా వయోవృద్ధులేనని గణాంకాలు చెబుతున్నాయి. ఈ కారణంగా టీకా ప్రక్రియ వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే పరిస్థితులు పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి వస్తాయని స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి:పెరుగుతున్న యాంత్రీకరణ- ఉద్యోగుల్లో ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.