ETV Bharat / business

ఆర్థిక వ్యవస్థపై లాక్​డౌన్​ ప్రభావమెంత..?

ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపా దేశాలు కూడా కోలుకోలేని స్తాయిలో దెబ్బతిన్నాయి. భారత్​లోనూ మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై పెను సవాలు విసురుతోంది. ఈ క్రమంలోనే ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఆర్థిక వ్యవస్థపై కరోనా.. దాని వల్ల విధించిన లాక్​డౌన్​ ప్రభావమెంత?

corona will have a chance to effect on financial crisis in india.. said experts
ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావమెంత..?
author img

By

Published : Apr 6, 2020, 5:57 AM IST

ప్రపంచాన్ని కరోనా వైరస్‌ మహమ్మారి ఆటాడుకుంటోంది. ఇప్పటికే పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనం దిశగా వెళ్తున్నాయి. అభివృద్ధి చెందిన ఐరోపా, అమెరికా దేశాలు కూడా కోలుకోలేని స్థాయిలో దెబ్బతిన్నాయి. కరోనా నియంత్రణకు మన దేశంలోనూ లాక్‌డౌన్‌ విధించడంతో పారిశ్రామిక కార్యకలాపాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. గత రెండు వారాలుగా లాక్‌డౌన్‌ నడుస్తుండటం వల్ల ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో ఆదాయం, లాభం భారీగా తగ్గే అవకాశం ఉందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత గిరాకీ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఎక్కువ సమయమే పట్టొచ్చని భావిస్తున్నాయి. ఉద్యోగాల కోతకు ఈ పరిణామాలు దారితీయొచ్చని సీఐఐ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా సీఈఓలు ఈ సర్వేలో పాల్గొని ఆయా అంశాలపై అభిప్రాయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా..

లాభాదాయాలు

ప్రస్తుత త్రైమాసికం (ఏప్రిల్‌- జూన్‌)తో పాటు గత త్రైమాసికంలో (జనవరి- మార్చి) ఆదాయం 10 శాతానికి పైగా తగ్గొచ్చని సర్వేలో ఎక్కువ మంది సీఈఓలు అభిప్రాయపడ్డారు. లాభాలు కూడా 5 శాతం మేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే.. దేశ జీడీపీ వృద్ధిపై తీవ్ర ప్రభావం పడొచ్చు.

నిల్వలు

ప్రస్తుతం నిల్వలు ఎక్కడివక్కడే పేరుకుపోయాయని 80 శాతం మంది చెప్పారు. లాక్‌డౌన్‌ ముగిసిన అనంతరం నెల రోజులు గడిచాక కూడా నిల్వల పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అంటున్నారు. అంటే.. లాక్‌డౌన్‌ తర్వాత గిరాకీ మందగమనాన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి.

ఉద్యోగాలు

కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌ ప్రభావం కారణంగా తమ తమ రంగాల్లో ఉద్యోగాల కోత ఉండొచ్చని 52 శాతం మంది సీఈఓలు అభిప్రాయపడ్డారు. 15 శాతానికి కంటే తక్కువ ఉద్యోగాల కోత ఉంటుందని 47 శాతం సంస్థలు అభిప్రాయపడ్డాయి. 15-30 శాతం మేర ఉద్యోగాలు పోవచ్చని 32 శాతం సంస్థలు భావిస్తున్నాయి.

ఉత్పత్తి- సరఫరా

లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర ఉత్పత్తులు, సహాయక వస్తువులను తయారు చేస్తున్న కంపెనీల్లో చాలా వాటికి తయారీ, సరఫరాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అవసరమైన మేర కార్మికులు లభించకపోవడం, రవాణా ప్రధాన అవరోధంగా తయారైందని ఎక్కువ మంది సీఈఓలు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.