ETV Bharat / business

ఫాస్టాగ్​తో​ టోల్​ వసూలు కోసం ప్రత్యేక అధికారులు - బిజినెస్ వార్తలు తెలుగు

జాతీయ రహదారుల అథారిటీ పరిధిలోని అన్ని టోల్​ గేట్లలో డిసెంబర్​ 1 నుంచి ఎలక్ట్రానిక్​ టోల్​​ను తప్పనిసరి చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ విధానాన్ని 100 శాతం అమలు చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది ప్రభుత్వం.

ఫాస్టాగ్​తో​ టోల్​ వసూలు కోసం ప్రత్యేక అధికారులు
author img

By

Published : Nov 17, 2019, 4:11 PM IST

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై 100 శాతం ఎలక్ట్రానిక్​ టోల్​ వసూలుకు కేంద్రం సమాయత్తమవుతోంది. డిసెంబర్ 1 నుంచి ఎలక్ట్రానిక్ టోల్ విధానం తప్పనిసరి చేయనున్నట్లు రోడ్డు రవాణా,రహాదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్​ను నియంత్రించడం సహా ఇతర సమస్యలను తొలగించేందుకు కేవలం ఫాస్టాగ్​ల ద్వారా మాత్రమే టోల్​ రుసుముల చెల్లింపులు జరిపేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. నేషనల్​ ఎలక్ట్రానిక్​ టోల్​ కలెక్షన్​ (ఏఈటీసీ) పేరుతో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఈ విధానం అమలైనప్పటికీ టోల్ ప్లాజాల ఒక వద్ద హైబ్రిడ్​ లైన్​ను ఉంచనున్నట్లు వెల్లడించింది కేంద్రం. ఈ లైన్​లో ఫాస్టాగ్​ సహా అన్ని విధానాల్లో చెల్లింపులను స్వీకరించనున్నట్లు పేర్కొంది.

పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు..

దేశవ్యాప్తంగా అన్ని టోల్​ ప్లాజాల వద్ద 100 శాతం ఎలక్ట్రానిక్​ టోల్​ వసూలు (ఈటీసీ) ప్రక్రియను అమలు చేసేందుకు రాష్ట్రాల వారీగా ప్రభారీ అధికారులను నియమించింది కేంద్రం.

ఈటీసీ విధానాన్ని పర్యవేక్షిస్తూ జాతీయ రహదారుల అథారిటీ(ఎన్​హెచ్​ఏఐ) తో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ, సమస్యలను పరిష్కరించటమే వీరి కర్తవ్యం.

ఇతర కీలక అంశాలు..

  • దేశవ్యాప్తంగా అన్ని టోల్ గేట్లను ఫాస్టాగ్ ఆధారిత చెల్లింపులు జరిపేందుకు సిద్ధం చేసింది ఎన్​హెచ్​ఏఐ.
  • దేశవ్యాప్తంగా మొత్తం 23 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, అమెజాన్​, పేటీఎంలో ఫాస్టాగ్​లు కొనుగోలు చేసే వీలుంది.
  • నేరుగా టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్​లను కొనే సౌకర్యం ఉంది.
  • ప్రస్తుతం ఈ విధానం ప్రారంభదశలో ఉన్న కారణంగా త్వరగా వినియోగదారులను ఆకర్షించేందుకు 2.5 శాతం క్యాష్​బ్యాక్​ ఆఫర్​ను ఇస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు ఈ ఆఫర్ ఉండనుంది.
  • ఎన్​హెచ్​ఏఐ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్​ నాటికి దేశవ్యాప్తంగా 60 లక్షల ఫాస్టాగ్​​లు జారీ అయ్యాయి.
  • ఫాస్టాగ్​​ల ద్వారా మొత్తం రూ.12,850 కోట్లు ఈటీసీ పద్ధతిలో గడించింది ఎన్​హెచ్​ఏఐ.

ఇదీ చూడండి: వాట్సాప్​లో కొత్త ఫీచర్ల సందడి.. అవేంటో తెలుసా?

Nov 17 (ANI): Gotabaya Rajapaksa has claimed victory in the Sri Lankan presidential polls and his main opponent Sajith Premadasa of the ruling United National Party has conceded defeat, even as the official results are yet to be announced. After local media reported that Rajapaksa won 53-54 per cent of the vote, Premadasa issued a statement on Sunday, "At the conclusion of a hard-fought and spirited election campaign, it is my privilege to honour the decision of the people and congratulate Mr Gotabaya Rajapaksa on his election as the seventh President of Sri Lanka." Rajapaksa, who has been credited for having crushed the Tamil Tigers 10 years ago, focused his campaign on his credentials as the defence secretary that brought a close to the bloody 26-year civil war, while also calling for an overhaul of economic policies implemented by Premadasa's UNP during its five years in charge of parliament. To win, a candidate has to secure at least 50% + one vote in the first round of counting, Elections Commission Chairman Mahinda Deshapriya had said. Rajapaksa, a former defence secretary and brother of two-time former President Mahinda Rajapaksa, based his campaign for on providing strong leadership on national security issues, following coordinated bombings in April that killed at least 269 people.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.