ETV Bharat / business

2020-21 బడ్జెట్ కసరత్తులో కీలక అధికారుల కొరత - సార్వత్రిక బడ్జెట్​ కసరత్తు ముమ్మరం

2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్​ కసరత్తును ముమ్మరం చేసింది కేంద్రం. అయితే బడ్జెట్​ రూపకల్పనలో కీలకమైన వ్యయాల కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో వీరు లేకుండా బడ్జెట్​ కసరత్తు ఎలా సాగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

BUDGET
బడ్జెట్​
author img

By

Published : Dec 9, 2019, 6:21 AM IST

వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ కసరత్తు జట్టులో ఈ సారి ఇద్దరు కీలక అధికారుల కొరత ఏర్పడింది. ఇదే తరుణంలో మోదీ 2.0 ప్రభుత్వం బడ్జెట్​పై కసరత్తు ముమ్మరం చేసింది.

2020-21 కేంద్ర బడ్జెట్​ను​ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంట్​లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక మాంద్యం భయాలు, వృద్ధి మందగమనం వంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి బడ్డెట్​లో​ నిర్మాణాత్మక సంస్కరణలకు పెద్దపీట వేయొచ్చనే అంచనాలు ఉన్నాయి.

రెండు కీలక పదవులు ఖాళీ..

ఈ సమయంలో బడ్జెట్​ రూపకల్పనలో కీలకమైన వ్యయాల కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి(బడ్జెట్) పదవులు దాదాపు మూడు నెలలుగా ఖాళీగా ఉన్నాయి.
ఇంతకు ముందు వ్యయాల కార్యదర్శిగా ఉన్న గిరీశ్​ చంద్ర ముర్మును కొత్తగా ఏర్పడిన కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్​కు తొలి లెఫ్టినెంట్ గవర్నర్​గా నియమించింది కేంద్రం. ముర్ము స్థానంలో ఆర్థిక కార్యకలాపాల కార్యదర్శి అతాను చక్రవర్తికి వ్యయాల కార్యదర్శి అదనపు బాధ్యతలను అప్పగించింది.
చక్రవర్తి 1985 గుజరాత్​ కేడర్​కు చెందిన ఐఏఎస్​ అధికారి. ఆర్థిక శాఖలో ఆర్థిక కార్యకలాపాల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పెట్టుబడులు, ఆస్తుల నిర్వహణ శాఖలో ఏడాదిపాటు పని చేసిన తర్వాత 2019 జూన్​లో చక్రవర్తిని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా నియమించింది కేంద్రం.

ఇప్పటికే ప్రారంభమైన కసరత్తు..

ఆర్థిక మంత్రిత్వ శాఖ.. 2020-21 ఆర్థిక సవంత్సరానికి సంబంధించి ముందస్తు బడ్జెట్​ (సవరించిన అంచనాలు) కసరత్తును ఇప్పటికే ప్రారంభించింది కేంద్రం. ఇందుకు సంబంధించి అక్టోబర్​ 14న పలు విభాగాలు, శాఖలతో సమావేశం నిర్వహించింది.

వ్యయాల కార్యదర్శి.. ఇతర కార్యదర్శులు, ఆర్థిక నిపుణులతో చర్చించిన తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాను ఖరారు చేస్తారు.
ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్​కు ఇది రెండో బడ్జెట్​. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో ఆమె ఈ బడ్జెట్​ను కీలకంగా తీసుకునే అవకాశముంది.

ఇదీ చూడండి:చేతక్​ టు పల్సర్​... హమారా 'బజాజ్​'కు సారథి​ ఆయనే

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++QUALITY AS INCOMING++
LOVIN MALTA - AP CLIENTS ONLY
Valletta - 8 December 2019
1. Various of march calling for the Maltese prime minister's resignation
STORYLINE:
People took to the streets of Valletta on Sunday to demand the immediate resignation of Maltese Prime Minister Joseph Muscat.
Muscat announced his resignation on 1 December, saying he would step down on 12 January 2020.
His speech had come hours after thousands of Maltese took to the streets of the capital to demand Muscat's resignation.
The prime minister has continually come under pressure to quit over alleged links of his former top aide to the car bomb killing of anti-corruption journalist Daphne Carsuana Galizia.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.