ETV Bharat / business

'ఐదేళ్ల మారటోరియంతోనే ఎంఎస్​ఎంఈలకు ఊరట'

author img

By

Published : Jan 26, 2021, 4:43 PM IST

కరోనా వల్ల ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల్లో భారీ అంచనాల నడుమ ఈ సారి కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు నిర్మలా సీతారామన్​. దీనితో ఈ సారి బడ్జెట్​లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రులు.. వడ్డీ రేట్లు సహా వివిధ అంశాల్లో సడలింపులు కావాలని కోరుతున్నాయి. ఈ అంశంపై ఎఫ్​కేసీసీఐ మాజీ అధ్యక్షుడు డీ మురళీధర్ 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా మాట్లాడారు.

This is what MSMEs want from the budget
బడ్జెట్​ నుంచి ఎంఎస్​ఎంఈలు కోరుతున్నదేమిటి

సాధారణంగా కేంద్రం బడ్జెట్​ ప్రవేశపెడుతుందంటే.. సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు.. వేతన జీవుల నుంచి కార్పొరేట్ల వరకు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అలాంటిది ఈ సారి కరోనా వల్ల ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నడుమ బడ్జెట్ రాబోతోంది. దీనితో అన్ని రంగాల్లో అంచనాలు మరింత పెరిగాయి.

కరోనా వల్ల తీవ్రంగా కుదేలైన రంగాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్​ఎంఈలు) కూడా ప్రధానంగా ఉన్నాయి. దీనితో ఎంఎస్ఎం​ఈలు కొవిడ్​ తెచ్చిన సంక్షోభం నుంచి బయటపడేందుకు.. అన్ని సాధారణ నిబంధనల్లో ఐదేళ్ల మారటోరియం అవసరమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు సూచిస్తున్నారు నిపుణులు. ఈ సారి బడ్జెట్​లో ఆ దిశగా నిర్ణయాలు ఉండాలని అంటున్నారు.

'దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్న ఎంఎస్​ఎంఈలు కరోనా నుంచి తేరుకోవాలంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.' అని ఫెడరేషన్​ ఆఫ్​ కర్ణాటక ఛాంబర్స్​ ఆఫ్​ కామర్స్ & ఇండస్ట్రీ (ఎఫ్​కేసీసీఐ) మాజీ అధ్యక్షుడు డీ మురళీధర్ 'ఈటీవీ భారత్​'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

D Muralidhar, Former President of Federation of Karnataka Chambers of Commerce and Industry
డీ మురళీధర్, ఎఫ్​కేసీసీఐ మాజీ అధ్యక్షుడు

పర్యావరణం, పన్నులు సహా వివిధ నిబంధనలు.. ఎంఎస్​ఎంఈలు, మధ్య స్థాయి పరిశ్రమలకు భారంగా మారుతున్నాయని అంటున్నారు మురళీధర్. 'నిబంధనలపై మారటోరియం విధించడం అనేది పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో పని. దీని వల్ల అదనపు ఆర్థిక భారంల కూడా పడదు. కానీ ఎంఎస్​ఎంఈలకు మాత్రం డబ్బు, సమయం రెండు ఆదా అవుతాయి.' అని చెబుతున్నారు.

కేంద్ర గణాంక కార్యాలయం అంచనాల ప్రకారం.. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఔట్​పుట్​లో 30 శాతం ఎంఎస్​ఎంఈలదే. మొత్తం ఎగుమతుల్లో 48 శాతంతో వీటి ద్వారానే జరుగుతున్నాయి. 11 కోట్ల మందికి ఎంఎస్ఎంఈలు ఉపాధి కల్పిస్తున్నాయి.

అధిక వడ్డీ రేట్ల భారం..

ఎంఎస్​ఎంఈలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో వడ్డీ రేట్లు కూడా ఉన్నయన్నారు మురళీధర్​. ఇతర రంగాలతో పోలిస్తే ఎంఎస్​ఎంఈలు రుణాలు పొందడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.

'ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే.. దేశంలో వడ్డీ రేట్లు రెండేళ్లుగా కాస్త తగ్గుతూ వస్తున్నాయి. అయినప్పటికీ.. ఎంఎస్​ఎంఈలు మాత్రం ఇంకా అధిక వడ్డీకే రుణాలు తీసుకోవాల్సి వస్తోంది.' అని తెలిపారు. ముఖ్యంగా గృహ, విద్యా రుణాలతో పోలిస్తే.. ఎంఎస్​ఎంఈ రుణాలకు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తు చేశారు.

ఎంఎస్​ఎంఈ రుణాలకు వడ్డీ భారం తగ్గించేందుకు బ్యాంకులతో కేంద్రం చర్చలు జరపాలని మురళీధర్ కోరారు. తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తే.. ఎంఎస్​ఎంఈల నిర్వహకులు ఎక్కువగా పెట్టుబడి పెట్టగలుగుతారని, సంస్థల సామర్థ్యాలూ పెరుగుతాయని విశ్లేషించారు.

లాక్​డౌన్​తో దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్​ఎంఈ)ను ఆదుకునేందుకు.. కేంద్రం గత ఏడాది అత్యవసర రుణ గ్యారెంటీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద రుణాలు పొందేందుకు.. 2021 మార్చి వరకు గడువు పెంచింది.

ఇదీ చూడండి:బడ్జెట్ తర్వాత తగ్గనున్న ఆ వస్తువుల ధరలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.