ETV Bharat / business

'300 ఏళ్ల కనిష్ఠానికి బ్రిటన్​ ఆర్థిక వ్యవస్థ'

బ్రిటన్​లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ 3 శతాబ్దాల కనిష్ఠానికి పడిపోతుందని అంచనా వేసింది బ్యాంక్​ ఆఫ్​ ఇంగ్లాండ్​. అయితే.. వచ్చే ఏడాది రికార్డ్​ స్థాయిలో కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కరోనాను ప్రపంచ దేశాలు త్వరగా కట్టడి చేయగలిగితే.. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ మరింత వేగంగా ఉంటుందని తెలిపింది.

Bank of England
మూడు శతాబ్దాల కనిష్ఠానికి బ్రిటన్​ ఆర్థిక వ్యవస్థ
author img

By

Published : May 7, 2020, 7:13 PM IST

కరోనా వైరస్​ కారణంగా బ్రిటన్​ ఆర్థిక వ్యవస్థ మూడు శతాబ్దాల కనిష్ఠానికి పడిపోనుందని హెచ్చరించింది బ్యాంక్​ ఆఫ్​ ఇంగ్లాండ్​. అయితే.. వచ్చే ఏడాదికి రికార్డ్​ స్థాయిలో కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. తొలి త్రైమాసికంలో 3 శాతం క్షీణత నమోదవగా.. అది రెండో త్రైమాసికానికి 25 శాతంగా ఉంటుందని తెలిపింది బ్యాంకు. దీంతో ఈ ఏడాది ఆరంభంతో పోలిస్తే.. అర్ధవార్షికానికి 30 శాతం మేర క్షీణిస్తుందని అంచనా వేసింది.

నిరుద్యోగం రెట్టింపు..

దేశంలో నిరుద్యోగ రేటు రెట్టింపునకు పైగా పెరిగి 9 శాతం మేర ఉంటుందని అంచనా వేసింది బ్యాంకు. ప్రభుత్వం 80 శాతం జీతాలు చెల్లించే సంస్థల్లో ఉన్న సుమారు 6 లక్షల మంది సిబ్బందిని ఈ లెక్కల్లో కలపలేదని.. వాటిని తీసుకుంటే మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

ఏడాది రెండో అర్ధభాగంలో..

లాక్​డౌన్​ ఆంక్షలను సడలించే చర్యలు చేపట్టిన తర్వాత ఈ ఏడాది రెండో అర్ధభాగం నుంచి బ్రిటీష్​ ఆర్థిక వ్యవస్థ కోలుకోవటం ప్రారంభమవుతుందని వెల్లడించింది బ్యాంకు. మార్చి, ఏప్రిల్​లో డిమాండ్​ సూచీ కనిష్ఠ స్థాయి నమోదైనప్పటికీ.. కొద్ది రోజులుగా స్థిరంగా కొనసాగుతోందని తెలిపింది. దీని ఫలితంగా.. 2020 చివరికి ఆర్థిక వ్యవస్థ 14 శాతం మేర క్షీణత నమోదవుతుందని వెల్లడించింది.

1706 తర్వాత అత్యల్పం.

బ్యాంకు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. బ్రిటీష్​ ఆర్థిక వ్యవస్థ వార్షిక క్షీణత రేటులో 1706 తర్వాత ఇదే అత్యల్పం. మొదటి ప్రపంచ యుద్ధం, స్పానిష్​ ఫ్లూ వంటి విపత్కర పరిస్థితుల సమయంలో ఎదురైనా దానికంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది బ్యాంకు. 2008-09 ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలోని క్షీణతతో పోలిస్తే సుమారు 3 రేట్లు అధికంగా ఉంటుందని తెలిపింది.
అయితే.. కరోనా మహమ్మారిని ప్రపంచ దేశాలు త్వరితగతిన కట్టడి చేయగలిగితే బ్రిటీష్​ ఆర్థిక వ్యవస్థ స్వల్ప కాలంలోనే కోలుకుంటుందని అభిప్రాయపడింది. వచ్చే ఏడాది నాటికి సుమారు 15 శాతం మేర కోలుకుంటుందని.. ఇది 1704 తర్వాత అత్యధిక వృద్ధి రేటుగా ఉంటుందని తెలిపింది బ్యాంకు.

వడ్డీ రేట్లను రికార్డ్​ స్థాయిలో 0.1 శాతంతోనే కొనసాగించాలని, బాండ్ల కొనుగోలు విధానాన్ని విస్తరించాలని బ్యాంకు ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఔట్​లుక్​ను విడుదల చేసింది బ్యాంకు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.