ETV Bharat / business

వొడా-ఐడియాకు 43 లక్షల యూజర్లు గుడ్​బై- జియోకు జై! - జూన్​లో జియోకు ఎంత మంది యూజర్లు పెరిగారు

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్ ఐడియా (Vodafone Idea crisis).. జూన్​లో దాదాపు 43 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. అయితే ఇదే సమయంలో టెలికాం దిగ్గజం జియో (Jio users gain in June) 54 లక్షల మంది యూజర్లను రాబట్టుకోవడం గమనార్హం. ట్రాయ్​ డేటా ద్వారా ఈ విషయం వెల్లడైంది.

User base down to Vodafone idea
వికి యూజర్ల షాక్​
author img

By

Published : Aug 23, 2021, 1:30 PM IST

Updated : Aug 23, 2021, 2:29 PM IST

వొడాఫోన్​ ఐడియా(వి)కు అటు ఆర్థికంగా ఇటు యూజర్​ బేస్​ పరంగా ఇబ్బందులు (Vodafone Idea crisis) తప్పడం లేదు. టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్​' (TRAI data on User base) వెల్లడించిన తాజా డేటా ప్రకారకం.. 'వి' జూన్​లో 42.89 లక్షల యూజర్లను కోల్పోయినట్లు (Vodafone Idea users lose) తెలిసింది. అంతకు ముందు మే నెలలోనూ 40 లక్షల యూజర్లను కోల్పోయింది వొడాఫోన్​ ఐడియా.

దేశియ అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్​ జియోకు మాత్రం (Jio Users gain in June) జూన్​లో 54,66,556 యూజర్లు పెరిగారు. అంతకు ముందు మే నెలలో కూడా ఈ టెల్కోకు 35.54 యూజర్లు పెరిగినట్లు డేటాలో వెల్లడైంది.

దేశంలో రెండో అతిపెద్ద టెలికాం సంస్థగా ఉన్న ఎయిర్​టెల్​కు కూడా జూన్​లో 38,12,530 యూజర్లు (Airtel Users gain in June) పెరిగారు. అయితే మేలో ఎయిర్​టెల్​ 46.13 లక్షల యూజర్లను కోల్పోవడం గమనార్హం.

ఇదీ చదవండి: వొడాఫోన్‌ ఐడియాను నిలబెట్టేందుకు కేంద్రం కసరత్తు

Last Updated : Aug 23, 2021, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.