ETV Bharat / business

ఆ విమాన సంస్థలో 7,500 ఉద్యోగాల కోత

author img

By

Published : Jul 4, 2020, 11:55 AM IST

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్​ ఫ్రాన్స్​ దాని అనుబంధ సంస్థ హాప్​లు భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమయ్యాయి. కరోనాతో తీవ్రంగా నష్టపోయిన ఈ సంస్థలు 2022 నాటికి సంయుక్తంగా 7,500 మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు ప్రకటించాయి.

jobs cut in Air France
విమాన సంస్థలో భారీగా ఉద్యోగాల కోత

కరోనాతో భారీగా నష్టపోయిన వాటిల్లో విమానయాన రంగం కూడా ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా చాలా విమాన సంస్థలు ఖర్చులు తగ్గించుకునే పనిలోపడ్డాయి. ఇందులో భాగంగా ఉద్యోగులను తొలగించుకోవడం వంటి చర్యలు చేపట్టాయి. ఇప్పుడు ఈ జాబితాలో ఫ్రాన్స్​కు చెందిన ఎయిర్​ ఫ్రాన్స్ దాని ప్రాంతీయ అనుబంధ సంస్థ హాప్​లు చేరాయి.

air franace
ఎయిర్​ ఫ్రాన్స్​

ఉద్యోగాల కోత ఇలా..

కరోనాతో ఎదురైన సంక్షోభం కారణంగా ఈ రెండు సంస్థలు 7,500 మంది ఉద్యోగులను (ఎయిర్​ ఫ్రాన్స్​ 6,500 మంది, హాప్ 1,000 మంది) తొలగించనున్నట్లు ప్రకటించాయి. ప్రస్తుతం ఎయిర్​ఫ్రాన్స్​లో 41,000 మంది, హాప్​లో 2,400 మంది ఉద్యోగులు ఉన్నారు.

ఎయిర్ ఫ్రాన్స్ ప్రకటనతో 'ఛార్లెస్​ డి గాల్లే ఎయిర్​పోర్ట్​' ​లోని ఎయిర్​ ఫ్రాన్స్ ప్రధాన కార్యాలయం వద్ద పలు ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగాయి.

ఈ ఉద్యోగాల కోత దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిరసనకారులు హెచ్చరించారు. అలాంటి పరిణామాలు ఎదురవకుండా, ఉద్యోగాల కోత లేకుండా సంస్థను గట్టెక్కించేందుకు ఉన్న నిధులను ఉపయోగించి.. ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని సూచించారు.

ఈ విషయంపై యూనియన్లతో చర్చించిన ఎయిర్ ఫ్రాన్స్ 2022 వరకు 7,500 మంది ఉద్యోగులను తగ్గించుకుంటామని వెల్లడించింది.

ఇదీ చూడండి:ఆ ఉబర్ కార్యాలయం శాశ్వతంగా మూసివేత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.