అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా డిసెంబర్ 21న ఎస్&పీ 500 ఇండెక్స్‌లో చేరనుంది. సోమవారం నాటి మార్కెట్ క్యాపిటల్ (ఎం-క్యాప్) ఆధారంగా.. ఈ బెంచ్‌మార్క్‌లో చేరిన తర్వాత టాప్ 10 కంపెనీల్లో ఒకటిగా నిలవనుంది.
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో (వరుసగా నాల్గో త్రైమాసికంలో) లాభాలను నమోదు చేసిన తర్వాత టెస్లా ఎస్&పీ 500 ఇండెక్స్‌లో ఎంపికైంది.
టెస్లా షేర్లు ఈ ఏడాది ఇప్పటి వరకు 387.8 శాతం పెరిగటం గమనార్హం.
ఇదీ చూడండి:2030 నాటికి పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాలు బంద్!