టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కొత్తగా అండర్గ్రాడ్యుయేట్ కోర్సు ప్రవేశపెట్టింది. కంప్యూటర్సైన్స్ గ్రూపునకు చెందిన ఈ కోర్సును కోయంబత్తూర్లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఆవిష్కరించింది టీసీఎస్. బీఎస్సీలో ఈ కోర్సు వ్యవధి మూడేళ్లు.
వేగంగా వృద్ధి చెందుతున్న సాంకేతక పరిజ్ఞానంతో పాటే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ కోర్సును ప్రవేశపెట్టినట్లు టీసీఎస్ గ్లోబల్ హెచ్ఆర్ ఆయేషా ఎస్ బసు పేర్కొన్నారు. ఈ కోర్సు కేవలం కంప్యూటర్సైన్స్లో కీలక అంశాలను బోధించేందుకు మత్రమే కాదని.. ప్రస్తుతం టెక్ పరిశ్రమకు కావాల్సిన ప్రమాణాలకు తగ్గట్టుగా రూపొందించినట్టు చెప్పారు.
విద్యార్థులకు మౌలిక సదుపాయాల నిర్వహణ, వర్చువలైజేషన్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ టెక్నాలజీల్లో అవగాహన పెంచేలా కోర్సు ఉంటుందని ఆయేషా తెలిపారు. దీని ద్వారా మూడేళ్లలో టెక్ పరిశ్రమకు కావాల్సిన విధంగా విద్యార్థులు సిద్ధమవుతారని అన్నారు.
దేశంలోని అన్ని ప్రముఖ కాళాశాల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు ఆయేషా.
ఇదీ చూడండి: అవినీతి కేసులో రోల్స్రాయిస్పై సీబీఐ కేసు