ETV Bharat / business

అదరగొట్టిన సన్​ఫార్మా- క్యూ1లో లాభాల పంట

author img

By

Published : Jul 30, 2021, 5:07 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో దేశీయ ఫార్మా దిగ్గజం సన్​ ఫార్మా రికార్డు స్థాయి లాభాలను గడించింది. ఏప్రిల్​-జూన్​ మధ్య సంస్థ నికర లాభం రూ.1,444.17 కోట్లుగా శుక్రవారం ప్రకటించింది.

Drug major Sun Pharma
ఫార్మా దిగ్గజం సన్​ ఫార్మా

దేశీయ ఫార్మా దిగ్గజం సన్​ ఫార్మా ఇండస్ట్రీస్​.. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికానికి గానూ రూ.1,444.17 కోట్ల నికర లాభాన్ని గడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో రూ.1,655.60 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది సన్​ ఫార్మా.

2021-22 క్యూ1లో సంస్థ ఆదాయం కూడా రూ.9,718.74 కోట్లకు పెరిగింది. 2020-21లో ఇదే సమయంలో ఈ మొత్తం రూ.7,585.25 కోట్లుగా ఉంది.

భారీ లాభాలను ప్రకటించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో.. సన్​ ఫార్మా షేర్లు దూసుకెళ్లాయి. బీఎస్​ఈలో సంస్ష షేరు శుక్రవారం 10.06 శాతం పుంజుకుని.. రూ.774 వద్ద స్థిరపడపింది. ఎన్​ఎస్​ఈలోనూ 10.04 శాతం లాభపడి.. రూ.773.55 వద్ద ముగిసింది.

ఇదీ చదవండి: ఓయోలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.