ETV Bharat / business

లాభ నష్టాలతో మార్కెట్ల దోబూచులాట - నిప్టీ

స్టాక్​మార్కెట్లు ఆటుపోట్ల మధ్య ట్రేడవుతున్నాయి. ప్రారంభ నష్టాల నుంచి తేరుకుని.. సెన్సెక్స్ 130 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది.

స్టాక్ మార్కెట్లు
author img

By

Published : May 2, 2019, 10:39 AM IST

స్టాక్​ మార్కెట్లతో నేడు లాభనష్టాలు దోబూచులాడుతున్నాయి. ఓ దశలో 100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ తిరిగి కాసేపటికే లాభాలను నమోదు చేసింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 130 పాయింట్లు బలపడి 39,160 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 30 పాయింట్ల స్వల్ప లాభంతో 11,778 వద్ద కొనసాగుతోంది.

గత సెషన్​లో భారీగా పతనమైన యస్​ బ్యాంకు షేర్లు తిరిగి లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ఇవీ కారణాలు

అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. అగ్రరాజ్య ఆర్థిక పరిస్థితిపై మిశ్రమ సంకేతాలిచ్చింది. ఫలితంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

లాభానష్టాల్లోనివే

సెన్సెక్స్​లో యస్​ బ్యాంకు, భారతీ ఎయిర్​టెల్​, హీరో మోటోకార్ప్, ఎం&ఎం, రిలయన్స్​, పవర్​గ్రిడ్​ షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.

టాటా మోటార్స్, మారుతి, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్​, టాటా స్టీల్​, హెచ్​సీఎల్​టెక్​ షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి.

రూపాయి, ముడిచమురు

రూపాయి నేడు ఫ్లాట్​గా ట్రేడవుతోంది. ప్రస్తుతం డాలర్​తో రూపాయి మారకం విలువ 69.57 వద్ద కొనసాగుతోంది.

ముడి చమురు ధరల బ్రెంట్ సూచీ 0.28 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్​ ముడి చమురు ధర 71.98 డాలర్లుగా ఉంది.

ఇతరమార్కెట్లు ఇలా..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు షాంఘై సూచీ, జపాన్ సూచీ నిక్కీ, దక్షిణ కొరియా సూచీ కోస్పిలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.