స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 135.16 పాయింట్లు లాభపడి... 39,122.65 పాయింట్లతో జీవనకాల గరిష్ఠం వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 26.50 పాయింట్ల స్వల్ప లాభంతో 11,817.20 వద్ద రికార్డుస్థాయి గరిష్ఠాన్ని తాకింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితంపై అంచనాల మధ్య స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
సెన్సెక్స్‌లో టాటా మోటర్స్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, మారుతి, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకు షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.
వేదాంత, భారతీ ఏయిర్టెల్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.