స్టాక్ మార్కెట్లో నేడు లాభాల జోరు కొనసాగుతోంది. కేంద్రం నుంచి మరిన్నిఉద్దీపనలు ఉండొచ్చన్న అశలతో కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు మదుపరులు.
మిడ్ సెషన్ తర్వాత బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 310 పాయింట్లకు పైగా లాభంతో.. ప్రస్తుతం 40,146 వద్ద రికార్డు స్థాయి దిశగా ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 80 పాయింట్లకు పైగా వృద్ధి చెంది.. 11,867 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివివే..
ఐటీసీ, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో ఉన్నాయి.
మారుతీ, ఎస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి: పేపర్ ఫోన్’ తోడుగా.. డిజిటల్ జీవితం హాయిగా