ఆర్థిక రంగంలో అమ్మకాల ఒత్తిడితో ఉదయం ఆటుపోట్ల నడుమ ప్రారంభమయ్యాయి స్టాక్ మార్కెట్లు. తిరిగి అదే రంగంలో కొనుగోళ్ల మద్దతుతో లాభాల బాట పట్టాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 238.69 పాయింట్లు బలపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి 38,939.22 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 67.45 పాయింట్ల లాభంతో... 11,671.95 వద్ద సెషన్ ముగించింది.
ఇదీ కారణం
ఆర్థిక, ఐటీ, వాహన, ఫార్మా రంగాల సానుకూలత నేటి లాభాలకు ప్రధాన కారణం.
ఇంట్రాడే సాగిందిలా..
సూచీ | గరిష్ఠం | కనిష్ఠం |
సెన్సెక్స్ | 38,978.99 | 38,598.72 |
నిఫ్టీ | 11,683.90 | 11,569.70 |
లాభనష్టాల లెక్కలివి...
లాభపడిన షేర్లు | నష్టపోయిన షేర్లు |
యస్ బ్యాంకు - 4.08 శాతం | ఏషియన్ పెయింట్స్ - 3.54 శాతం |
టాటా మోటర్స్ - 2.67 శాతం | ఇన్ఫోసిస్ - 0.95 శాతం |
ఐసీఐసీఐ బ్యాంకు - 2.52 శాతం | భారతీ ఎయిర్టెల్ - 0.76 శాతం |
బజాజ్ ఆటో - 2.19 శాతం | బజాజ్ ఫినాన్స్ - 0.48 శాతం |
కోల్ ఇండియా - 2.12 శాతం | ఓఎన్జీసీ - 0.35 శాతం |
30 షేర్ల ఇండెక్స్‌లో 25 షేర్లు లాభాలను ఆర్జించాయి. 5 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
50 షేర్ల నిఫ్టీ ప్యాక్‌లో 37 షేర్లు లాభాలను, 13 షేర్లు నష్టాలను నమోదు చేశాయి.