స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న ఆశలతో మదుపరులు సానుకూలంగా స్పందించారు. దాదాపు అన్ని రంగాలు.. నేడు లాభాలతో ముగిశాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో.. సంస్థ నష్టాలు భారీగా తగ్గినట్లు టాటా మోటార్స్ ఇటీవలే ప్రకటించింది. ఫలితంగా మోటార్స్ షేర్లు దూసుకెళ్లాయి. నేటి మార్కెట్ల లాభాలకు ఇదీ ఓ కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 582 పాయింట్లు బలపడింది. చివరికి 39,832 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 160 పాయింట్లు వృద్ధి చెంది..11,787 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 39,917 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 38,254 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ 11,809 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,627 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
టాటా మోటార్స్ అత్యధికంగా 16.63 శాతం లాభపడింది. టాటా స్టీల్ 7.09 శాతం, ఎస్ బ్యాంకు 6.30 శాతం, యాక్సిస్ బ్యాంకు 4.06 శాతం, మారుతీ 4.01 శాతం, టెక్ మహీంద్రా 3.82 శాతం బలపడ్డాయి.
భారతీ ఎయిర్టెల్ 3.41 శాతం, కోటక్ బ్యాంకు 1.14 శాతం, పవర్ గ్రిడ్ 0.64 శాతం, ఎస్బీఐ 0.55 శాతం నష్టాలను నమోదు చేశాయి.
ఇదీ చూడండి: 5 కెమెరాలతో షియోమీ నుంచి సూపర్ బడ్జెట్ ఫోన్!