ETV Bharat / business

సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 12 వేల మార్క్ దాటిన నిఫ్టీ

దేశీయ, అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 184 పాయింట్ల లాభంతో మరో సారి జీవనకాల గరిష్ఠాన్ని చేరింది. నిఫ్టీ 50 పాయింట్లు బలపడి 12 వేల మార్కును అందుకుంది.

సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 12 వేల మార్క్ దాటిన నిఫ్టీ
author img

By

Published : Nov 7, 2019, 4:08 PM IST

స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర నేడూ కొనసాగింది. దిగ్గజ సంస్థల షేర్లు రాణించడం, గృహ నిర్మాణానికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన నేటి లాభాలకు ప్రధాన కారణం. అంతర్జాతీయ సానుకూలతలు నేటి లాభాలకు ఊతమందించాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 184 పాయింట్లు బలపడింది. 40,654 పాయింట్లతో జీవనకాల గరిష్ఠాల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 50 పాయింట్లు బలపడి..12,016 వద్దకు చేరి.. జీవనకాల గరిష్ఠానికి అడుగు దూరంలో ముగిసింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 40,688 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకగా.. ఉదయం లాభాల స్వీకరణతో 40,421 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,021 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,947 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

సన్​ఫార్మా 3.50 శాతం, ఇండస్ ఇండ్​ బ్యాంకు 2.74 శాతం, రిలయన్స్ 2.09 శాతం, ఏషియన్ పాయింట్లు 1.69 శాతం, వేదాంత 1.69 శాతం, ఐటీసీ 1.68 లాభాలను ఆర్జించాయి.
ఇండస్​ఇండ్​ బ్యాంకు 3.27 శాతం, హిందుస్థాన్​ యునిలీవర్​ 1.83 శాతం, ఓఎన్​జీసీ 1.69 శాతం, టాటా మోటార్స్ 1.66 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.33 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి: ఆర్​సెప్​కు భారత్​ 'నో'తో 10కోట్ల మంది రైతులకు మేలు!

Mumbai, Nov 07 (ANI): Team 'Marjaavaan' was seen promoting their film in Mumbai. Actor Sidharth Malhotra looked dapper as he posed for shutterbugs in navy blue tee and trouser. Actor Rakul Preet Singh looked cute with her dazzling smile. She picked up neon dress for the promotional event. Meanwhile, Riteish Deshmukh was also seen at the event. He kept his look super funky. 'Marjaavaan' will release on November 22.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.