ETV Bharat / business

అన్న బాటలో తమ్ముడు- అప్పుల నుంచి విముక్తి! - ముకేశ్​ బాటలో అనిల్

సంక్షోభంలో కూరుకుపోయిన అనిల్ అంబానీ.. రుణ ఊబి నుంచి బయటపడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆస్తుల విక్రయం ద్వారా అప్పులు తగ్గించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తొలుత ఈ ఆర్థిక సంవత్సరం నాటికి రిలయన్స్ ఇన్​ఫ్రాను అప్పులు లేని సంస్థగా మార్చనున్నట్లు అనిల్ అంబానీ ప్రకటించారు.

anil Ambani debt free plans
అప్పులు తీర్చేందుకు అనిల్ ప్రయత్నాలు
author img

By

Published : Jun 24, 2020, 1:10 PM IST

అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్(అడాగ్​) అధినేత అనిల్ అంబానీ... అన్న ముకేశ్ అంబానీ బాటను ఎంచుకున్నారు. ఇటీవలే ముకేశ్ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణ రహితంగా మారగా.. ఇప్పుడు తన సంస్థలను కూడా రుణ రహితంగా మార్చేందుకు అనిల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత రిలయన్స్ ఇన్​ఫ్రాను రుణ రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇన్​ఫ్రా అప్పులులే ని సంస్థగా మారుతుందని అనిల్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. సంస్థ 91వ వార్షిక వాటాదారుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు​.

ప్రస్తుతం రిలయన్స్​ ఇన్​ఫ్రాపై రూ.6,000 కోట్ల రుణ భారం ఉంది.

ప్రణాళికలు ఇలా..

2018లో ముంబయిలోని ఇంధన వ్యాపారాలను అదానీ ట్రాన్స్​మిషన్​కు విక్రయించడం ద్వారా సంస్థ రుణాలు రూ.18,800 కోట్ల నుంచి రూ.7,500 కోట్లకు తగ్గాయి.

దిల్లీ-ఆగ్రా రోడ్​ను క్యూబ్​ హైవే & ఇన్​ఫ్రా రూ.3,600 కోట్లకు విక్రయించేందుకు సిద్ధమైంది ఈ సంస్థ. ఇందుకు ఎన్​హెచ్​ఏఐ అనుమతులు లభించినట్లు రిలయన్స్ ఇన్​ఫ్రా ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించింది. వీటితో పాటు మరిన్ని ఆస్తుల విక్రయం ద్వారా సంస్థను రుణ రహితంగా మార్చాలని అనిల్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

వాటాల పెంపు..

నియంత్రణ, మధ్యవర్తిత్వ పరమైన కారణాలతో కంపెనీకి రావాల్సిన దాదాపు రూ.60 వేల కోట్లు చిక్కుకున్నాయని అనిల్ తెలిపారు. ప్రస్తుతం కంపెనీ మొత్తం ఆస్తుల విలువ రూ.65 వేల కోట్లు, నికర విలువ రూ.11 వేల కోట్లుగా ఉన్నట్లు​ వెల్లడించారు. రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా కంపెనీల్లో ప్రమోటర్ల వాటా పెంచుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు.

గత వారం ప్రిఫరెన్షియల్‌ కేటాయింపు ద్వారా 10 శాతం వరకు వాటా పెంచుకునేందుకు ప్రమోటర్లకు సెబీ అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది మార్చికి రిలయన్స్‌ ఇన్‌ఫ్రాలో 14.7 శాతం, రిలయన్స్‌ పవర్‌లో 19.29 శాతం చొప్పున ప్రమోటర్లకు వాటాలు ఉన్నాయి.

ఇదీ చూడండి:ముకేశ్‌ అంబానీ వేతనం.. 12వ ఏడాదీ రూ.15 కోట్లే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.