భారత సంపన్నుడు, దిగ్గజ పారిశ్రామికవేత్త.. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థ మరో ఘనత సాధించింది. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ విడుదల చేసిన.. బ్రాండ్ల జాబితాలో 2020లో ఆపిల్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది.
''భారత్‌లో లాభార్జనలో ముందున్న రిలయన్స్ సంస్థ.. గౌరవప్రదమైనది. నైతిక విలువలు కలిగి ఉంది. వినియోగదారులకు ఉత్తమ సేవలందించడం సహా.. సృజనాత్మక ఉత్పత్తులు, వృద్ధి రంగాల్లో మంచిప్రదర్శన కనబర్చింది. భారతీయులకు అన్ని వస్తువులు ఒకే చోట దొరికే విధంగా సంస్థను ముకేశ్ అంబానీ తీర్చిదిద్దారు.''
- ప్యూచర్ బ్సాండ్ ఇండెక్స్
ప్రస్తుతం రిలయన్స్ సంస్థ.. శక్తి, పెట్రో కెమికల్స్, టెక్స్‌టైల్స్, సహజ వనరులు, రిటైల్ సహా టెలి కమ్యూనికేషన్ రంగాల్లో సత్తా చాటుతోందని వెల్లడించింది ప్యూచర్ బ్రాండ్ ఇండెక్స్. గూగుల్, ఫేస్ బుక్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు.. జియోలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపింది. వచ్చే ఏడాది నాటికి ఈ జాబితాలో రిలయన్స్ మొదటి స్థానంలో నిలిచే అవకాశముందని ప్యూచర్ బ్రాండ్స్ సంస్థ తెలిపింది.