ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం సుమారు 38.7 శాతం మేర క్షీణించి రూ.6,348 కోట్లుగా నమోదైంది. విద్యుత్తు, పెట్రోకెమికల్ వ్యాపారాల్లో మందగమనంతో క్యూ4 ఫలితాలపై ప్రభావ పడినట్లు సంస్థ తెలిపింది.
గతేడాది 2019లో జనవరి-మార్చి త్రైమాసికంలో సంస్థ రూ.10,362 కోట్ల నికర లాభాన్ని అర్జించింది.
రూ. 53,125 కోట్ల విలువైన రైట్స్ ఇష్యూను కూడా ప్రకటించింది. 1:15 నిష్పత్తిలో ఒక్కో షేరుకు రూ.1,257 ధరతో అందించనున్నట్లు ప్రకటించింది. ఇంత భారీ మొత్తంలో సంస్థ మదుపరులకు షేర్లు అందించడం దేశంలో అతి పెద్దదిగా పేర్కొంది.
జియో ధన్ ధనాధన్
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికాం విభాగం జియో.. 2019-20 ఆర్థిక ఏడాది నాలుగో త్రైమాసికంలో భారీ లాభాలు ఆర్జించింది. మార్చితో ముగిసిన క్యూ4లో 177 శాతం వృద్ధితో రూ.2,331 కోట్ల నికర లాభం ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 840 కోట్లుగా ఉంది.
ఇదీ చూడండి: ఇన్ఫోసిస్ నాలుగో త్రైమాసిక లాభం రూ.4,335 కోట్లు