ETV Bharat / business

25 కోట్ల మార్క్ దాటిన ఫోన్​పే రిజిస్టర్డ్ యూజర్స్

ప్రముఖ డిజిటల్ లావాదేవీల ప్లాట్​ఫామ్​ ఫోన్​పే.. రిజిస్టర్డ్​ యూజర్ల సంఖ్య 250 మిలియన్ల మార్క్​ దాటినట్లు ప్రకటించింది. అక్టోబర్​లో నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 100 మిలియన్లుగా నమోదైనట్లు తెలిపింది.

Phone pe users number
ఫోన్​పే యూజర్ల సంఖ్య
author img

By

Published : Nov 2, 2020, 2:11 PM IST

ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్​కార్ట్​కు చెందిన ఫిన్​టెక్​ విభాగం ఫోన్​పేకు భారీగా యూజర్లు పెరిగారు. తమ ప్లాట్​ఫామ్ రిజిస్టర్డ్​ యూజర్ల సంఖ్య 25 కోట్ల మార్క్​ను దాటినట్లు సోమవారం ప్రకటించింది.

అక్టోబర్ నెలలో 10 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు, 2.3 బిలియన్ల యాప్ సెషన్లు నమోదైనట్లు తెలిపింది ఫోన్​పే.

గత నెల రికార్డు స్థాయిలో 925 మిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసినట్లు వివరించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికమని తెలిపింది. వార్షిక టీవీపీ (మొత్తం పేమెంట్ల సంఖ్య) రన్​ రేట్ 277 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. అక్టోబర్​లో మొత్తం 835 మిలియన్ల యూపీఐ లావాదేవీల చేసినట్లు వెల్లడించింది. మొత్తం 40 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉన్నట్లు వివరించింది.

2022 డిసెంబర్​ నాటికి రిజిస్టర్డ్ యూజర్ల సంఖ్య 50 కోట్ల మార్క్​ను చేరుకోవడమే లక్ష్యంగా తమ ముందున్న లక్ష్యమని ఫోన్​పే సీఈఓ సమీర్ నిగమ్ తెలిపారు.

ఇదీ చూడండి:అక్టోబర్​లో తయారీ రంగ పీఎంఐ రికార్డు వృద్ధి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.