ETV Bharat / business

ఆ సంస్థ ఉద్యోగులకు కరోనా బోనస్​.. ఎంతంటే? - ఉద్యోగులకు కొవిడ్ బోనస్​

తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఓ ప్రముఖ టెక్​ సంస్థ. కొవిడ్​ కష్టకాలంలో పని చేసినందుకు గాను.. ప్రత్యేక బోనస్​ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులందరికీ సింగిల్​టైం బోనస్​ ఇవ్వనున్నట్లు తెలిపింది.

Microsoft COVID bonus to Employees
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు స్పెషల్ బోనస్​
author img

By

Published : Jul 9, 2021, 3:04 PM IST

Updated : Jul 9, 2021, 3:28 PM IST

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు గుడ్​ న్యూస్ చెప్పింది. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 1,500 డాలర్ల(రూ.1.12 లక్షలు)ను సింగిల్‌ టైం బోనస్‌గా ప్రకటించింది. మహమ్మారి మూలంగా కష్టంగా గడిచిన ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో ఉద్యోగుల కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కార్పొరేట్‌ వైస్ ప్రెసిడెంట్‌ కంటే కింది స్థాయి ఉద్యోగులందరికీ ఈ బోనస్ వర్తిస్తుందని పేర్కొంది. 2021 మార్చి 31కి ముందు ఉన్న ఉద్యోగులందరికీ ఈ బోనస్​ ఇవ్వనున్నట్లు తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కు 1,75,508 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరి బోనస్‌ కోసం సంస్థ 200 మిలియన్‌ డాలర్లు అదనంగా కేటాయించనుంది. అయితే, కంపెనీ అనుబంధ సంస్థలైన లింక్డిన్‌, గిట్‌హబ్‌, జెనీమ్యాక్స్‌కు చెందిన ఉద్యోగులు మాత్రం బోనస్‌కు అర్హులు కాదు. ఫేస్‌బుక్ కూడా ఇటీవలే.. తమ సంస్థలోని 45 వేల మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి 1,000 డాలర్ల బోనస్ ప్రకటించింది. హాలిడే బోనస్‌ కింద అమెజాన్‌ కూడా 300 డాలర్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి:'కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి'

Last Updated : Jul 9, 2021, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.