ETV Bharat / business

యులిప్‌లో పెట్టుబడులా? ఇవి తెలుసుకోండి!

ULIP Plans: మహమ్మారి భయం ఇంకా పోలేదు. ఈ విపత్కర సమయంలో ప్రతి ఒక్కరికీ మంచి ఆర్థిక ప్రణాళికతో పాటు, భవిష్యత్‌కు రక్షణ కల్పించే పథకాలూ ఎంతో ముఖ్యం. జీవిత బీమా పాలసీలు తీసుకునేటప్పుడు.. రక్షణతోపాటు.. దీర్ఘకాలంలో సంపద వృద్ధికీ అవకాశం ఉండేవి తీసుకోవాలనుకుంటే.. యూనిట్‌ ఆధారిత పాలసీలు (యులిప్‌) అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎంపిక చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

ULIP policy
యులిప్‌.. ఇవన్నీ తెలుసుకున్నాకే
author img

By

Published : Feb 4, 2022, 2:59 PM IST

ULIP Policy: ఒక వ్యక్తి బీమా, పెట్టుబడి అవసరాలను తీర్చే హైబ్రీడ్‌ పథకంగా యులిప్‌లను పేర్కొనవచ్చు. చెల్లించిన ప్రీమియంలో బీమా రక్షణకు మినహాయించిన మొత్తం పోను, మిగతా పాలసీదారుడి ఇష్టానుసారం ఫండ్లలో మదుపు చేస్తాయి. చెల్లించిన ప్రీమియానికి సెక్షన్‌ 80సీ పరిమితి మేరకు పన్ను మినహాయింపు లభించడం మరో ఆకర్షణ. రూ.2.5లక్షల లోపు వార్షిక ప్రీమియం ఉన్న పాలసీల వ్యవధి తీరాక వచ్చే మొత్తానికీ సెక్షన్‌ 80సీసీడీ ప్రకారం పన్ను ఉండదు. ఇవే కాకుండా పాలసీని తీసుకునేటప్పుడు పరిశీలించాల్సిన ఇతర అంశాల విషయానికి వస్తే..

తగిన మొత్తానికి

బీమా పాలసీదారుడికి ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు నామినీకి పరిహారం లభిస్తుంది. యులిప్‌ తీసుకునేటప్పుడే ఎంత మొత్తానికి పాలసీ తీసుకుంటారన్నది నిర్ణయించుకోవాలి. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే.. దురదృష్ట సంఘటనలు జరిగినప్పుడు కుటుంబ పెద్ద బాధ్యతను బీమా పాలసీ తీసుకోవాలి. అంటే, కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా అవసరమైన మొత్తానికి పాలసీ తీసుకోవాలి. పాలసీదారుడికి ఎలాంటి ఇబ్బందీ కలగకుంటే.. వ్యవధి తీరిన తర్వాత మోర్టాలిటీ ఛార్జీలను తిరిగి చెల్లించే విధంగా పాలసీని ఎంచుకోవాలి.

అదనపు ఖర్చులు..

పాలసీ నిర్వహణ ఖర్చులు, ప్రీమియం అలెకేషన్‌ ఛార్జీలు, ఫండ్‌ నిర్వహణ రుసుములు, టాపప్‌ ఛార్జీలు, మోర్టాలిటీ, అనుబంధ పాలసీలు, ప్రీమియం మధ్యలో నిలిపివేయడం.. ఇలా యులిప్‌లలో అనేక రకాల రుసుములుంటాయి. బీమా సంస్థలను బట్టి, ఇవి మారుతూ ఉంటాయి. పాలసీ కోసం బీమా సంస్థను సంప్రదించేముందు.. ఈ రుసుముల గురించి పూర్తిగా అర్థం చేసుకోండి. చెల్లించిన ప్రీమియం నుంచి ఎంత మొత్తం వీటికి వెళ్తుంది అన్నది వచ్చే లాభాలనూ ప్రభావితం చేస్తుందని మర్చిపోవద్దు. ఇప్పుడు వస్తున్న కొత్తతరం యులిప్‌లకు సాధారణంగా రుసుములు కాస్త తక్కువగానే ఉంటున్నాయి. యులిప్‌లు దీర్ఘకాలిక పథకాలు. కాబట్టి, వీటిని తీసుకునేటప్పుడు సంస్థ విశ్వసనీయతనూ, క్లెయిం చెల్లింపుల చరిత్రనూ పరిశీలించాలి.

లక్ష్యాల ఆధారంగా

యులిప్‌లలో పెట్టుబడి పథకాలను ఎంచుకునేటప్పుడు నష్టభయం భరించలేని వారు డెట్‌ ఫథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మంచి రాబడి రావాలి అనుకునే వారు ఈక్విటీలను పరిశీలించవచ్చు. ఈక్విటీలు, డెట్‌ ఫండ్ల మిశ్రమంగా హైబ్రీడ్‌ ఫండ్లనూ ఎంచుకోవచ్చు. పాలసీ తీసుకునేటప్పుడు మీ లక్ష్యాలకు తగ్గట్టుగా ఉన్న పాలసీలను పోల్చిచూసుకోవాలి. ఫండ్ల పనితీరు, గత చరిత్రను చూడాలి.

- రేష్మా బండ, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, బజాజ్‌ అలియంజ్‌ లైఫ్‌

ఇదీ చదవండి: జుకర్​బర్గ్​ను వెనక్కి నెట్టిన అంబానీ, అదానీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.