ETV Bharat / business

మార్కెట్లోకి కియో సొనెట్- ధర ఎంతంటే? - కియా సొనెట్ ధర

భారత మార్కెట్లోకి మరో ఎస్​యూవీని విడుదల చేసింది కియా మోటార్స్. ఆకర్షణీయమైన డిజైన్​తో సొనెట్ పేరుతో వచ్చిన ఈ మోడల్​ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. పూర్తిగా భారత్​లోనే తయారైన ఈ మోడల్ ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి.

kia sonet suv price
కియా సొనెట్ ఎస్​యూవీ ధర
author img

By

Published : Sep 18, 2020, 2:45 PM IST

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ భారత్​లో సరికొత్త ఎస్​యూవీని ఆవిష్కరించింది. సొనెట్​ పేరుతో మార్కెట్లోకి ఈ మోడల్​ను శుక్రవారం విడుదల చేసింది.

సొనెట్ పెట్రోల్ వేరియంట్ ప్రారంభ (ఎక్స్​ షోరూం) ధర రూ.6.71 లక్షలుగా, గరిష్ఠ ధర రూ.11.99 లక్షలుగా నిర్ణయించింది.

డీజిల్ వేరియంట్ ప్రారంభ(ఎక్స్​ షోరూం) ధర రూ.8.05 లక్షలుగా, గరిష్ఠ ధర రూ.10.39 లక్షలుగా నిర్ణయించింది కియా మోటార్స్.

భారత్​లోనో ఉత్పత్తవుతున్న సొనెట్​ మోడల్​ను ఇక్కడి నుంచే 70కి పైగా దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కియా మోటార్స్ ఇండియా ఉపాధ్యక్షుడు మనోహర్ భట్ తెలిపారు.

సొనెట్ మోడల్​ కోసం ముందస్తు బుకింగ్స్ ద్వారా 25 వేల ఆర్డర్లు అందినట్లు కియా మోటార్స్ తెలిపింది. వారికి ఈ నెల నుంచే డెలివర్ చేయనున్నట్లు వెల్లడించింది.

ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన సొనెట్.. మారుతీ విటారా బ్రెజా, హ్యుందాయ్‌ వెన్యూ, టాటా నెక్సాన్‌ వంటి మోడళ్లతో పోటీపడే అవకాశం ఉంది.

సొనెట్ ఫీచర్లు..

  • ఫోర్ సిలిండర్ ఇంజిన్
  • ఫైవ్ ట్రాన్స్ మిషన్ స్పీడ్ ఫీచర్ కలిగిన వైల్డ్ డిజైన్
  • ఎలక్ట్రానిక్ బ్రేక్స్ ఫోర్స్ డస్ట్రిబ్యూషన్​తో కూడిన యాంటీలాక్ బ్రేకింగ్ వ్యవస్థ
  • రిమోట్ ఇంజిన్ స్టార్ట్/ స్టాప్​, రిమోట్ ఎయిర్ కాన్ కంట్రోల్స్‌
  • ఆరు ఎయిర్​బ్యాగ్​లు సహా పలు అధునాతన ఫీచర్లు సొనెట్ మోడల్​లో పొందుపరిచింది కియా మోటార్స్.

ఇదీ చూడండి:సెప్టెంబర్ 23న భారత్​లో యాపిల్ ఆన్​లైన్ స్టోర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.