ETV Bharat / business

ఐఓసీఎల్​లో ఉద్యోగ అవకాశాలు- నెలకు రూ.1.05 లక్షల జీతం! - ఐఓసీఎల్​ ఉద్యోగాలకు దరఖాస్తు ఎలా

ఇండియన్ ఆయిల్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ గుడ్​ న్యూస్ చెప్పింది. జూనియర్ లెవెల్​లో వివిధ పోస్టుల భర్తీకి నియమామకాలు (IOCL Recruitment 2021) చేపడుతున్నట్లు తెలిపింది. ఈ జాబ్స్​కు (IOCL Non Executive Posts) అప్లయి చేయడం ఎలా? శాలరీ ఎంత? అర్హతలు ఏమిటి? అనే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Jobs in IOC
ఐఓసీలో ఉద్యోగాలు
author img

By

Published : Sep 23, 2021, 1:09 PM IST

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ (ఐఓసీఎల్​) పెద్ద సంఖ్యలో నియామకాలు చేపడుతోంది. నాన్​ ఎగ్జిక్యూటివ్​ పోస్టుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది.

మొత్తం 513 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది ఐఓసీఎల్​. అర్హులైన వారు.. ఆన్​లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది.

పోస్టుల వివరాలు..

  • జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్​ - 479
  • జూనియర్​ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్​ - 29
  • జూనియర్​ మెటీరియల్ అసిస్టెంట్/టెక్నికల్ అసిస్టెంట్​- 04
  • జూనియర్ నర్సింగ్ అసిస్టెంట్​ - 01

అర్హతలు..

  • 2021 నాటికి 18 ఏళ్లు నిండి.. 26 ఏళ్లు దాటకుండా ఉండాలి. నాన్​ క్రీమీలేయర్​, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వరకు.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగార్థులకు 5 ఏళ్ల వరకు సడలింపు.
  • ఉద్యోగార్హతను బట్టి నెలకు రూ.25,000 నుంచి రూ.1,05,000 వరకు వేతనం.
  • పోస్టులకు సంబంధించిన సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ఫీజు ఎంత?

రూ.150 ఫీజు చెల్లించాలి. అది కూడా ఎస్​బీఐ చలాన్​ ద్వారా మాత్రమే. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు ఎలా చేయాలి?

  • ఐఓసీఎల్​ అధికారిక వెబ్​సైట్​లోకి లాగిన్ అవ్వాలి
  • Careers ట్యాబ్​ను క్లిక్​ చేయాలి
  • అందులో Non-Executive Recruitment 2021 కనిపిస్తుంది
  • అప్లయ్​ ఆన్​లైన్ లింక్​పై క్లిక్​ చేయాలి
  • ఫారంలో తప్పనిసరైన వివరాలన్నీ నింపాలి
  • ఈ-చలాన్​తో నిర్ణీత ఫీజు చెల్లించి.. ఆన్​లైన్​లో సబ్మిట్​ చేయాలి
  • ఈ దరఖాస్తును గడువులోగా ప్రింటౌట్​ తీసుకోవాలి.. (తదుపరి ప్రక్రియకు ఇది అవసరమవుతుంది)

ముఖ్యమైన తేదీలు..

  • సెప్టెంబర్ 21 నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అక్టోబర్​ 12 చివరి తేదీ.
  • అప్లికేషన్ ప్రింటౌట్​ తీసుకునేందుకు తుది గడువు అక్టోబర్ 15.
  • అక్టోబర్ 24న రాత పరీక్ష నిర్వహించే అవకాశముంది.
  • పరీక్ష అనుకున్న సమయానికి జరిగితే నవంబర్​ 11న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఇదీ చదవండి: ఐటీ రీఫండ్​ అంటూ మోసాలు.. ఆండ్రాయిడ్ యూజర్లే టార్గెట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.