ETV Bharat / business

ప్రగతి సూచీల నేలచూపులు... 2019-20లో వృద్ధి 5శాతమే!

ఆర్థిక మాంద్యం భయాలను మరింత పెంచుతూ ఎస్​బీఐ తాజా నివేదిక విడుదల చేసింది. 2019-20లో జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికే పరిమితం కావచ్చని అంచనా వేసింది.

జీడీపీ
author img

By

Published : Nov 12, 2019, 6:35 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను 5 శాతానికి తగ్గించింది ఎస్​బీఐ. ఇంతకు ముందు ఎస్​బీఐ విడుదల చేసిన నివేదికలో వృద్ధి రేటును 6.1 శాతంగా అంచనా వేయడం గమనార్హం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనూ జీడీపీ వృద్ధి 4.2 శాతానికే పరిమితమవుతుందని ఎస్​బీఐ తాజా నివేదికలో పేర్కొంది. వాహన రంగ సంక్షోభం, కీలక రంగాల్లో నెలకొన్న స్తబ్దత, నిర్మాణ, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని ఎస్​బీఐ నివేదిక వెల్లడించింది.

2019-20 తొలి త్రైమాసికంలోనూ జీడీపీ వృద్ధి ఆరేళ్ల కనిష్ఠం వద్ద 5 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి మందగించినా.. 2020-21లో మాత్రం 6.2 శాతానికి పెరగొచ్చని నివేదిక అభిప్రాయపడింది.

ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు డిసెంబర్​లో జరిగే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో 25 బేసిస్​ పాయింట్ల రెపో తగ్గే అవకాశమున్నట్లు ఎస్​బీఐ అంచనా వేసింది. గత నెలలో జరిగిన ఎంపీసీ సమావేశంలోనూ.. 25 బేసిస్​ పాయింట్ల రెపో రేటు తగ్గించింది ఆర్బీఐ.

జీడీపీపై.. ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదికలోనూ వృద్ధి రేటు అంచనాను 6.9 నుంచి 6.1 శాతానికి తగ్గించింది.

ఇదీ చూడండి: నకిలీ వార్తలపై కఠిన చర్యలకు ట్విట్టర్​ సంసిద్ధం!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ISRAELI POLICE HANDOUT- AP CLIENTS ONLY
Netivot - 12 November 2019
1. Various of damage to residential home
2. Police opening gate and entering scene
3. Various of police at house
4. Pan from hole in roof from rocket, water dripping, to rubble on kitchen's floor  
5. Police outside house  
STORYLINE:
A rocket fired from Gaza has scored a direct hit on a residential home in southern Israel.
The rocket penetrated the roof of a home in Netivot Tuesday morning.
No one was injured.
It was one of more than 50 rockets the military said were fired from Gaza following Israel's killing of a senior Islamic Jihad commander.
In one instance, a rocket landed on a highway, narrowly missing a passing vehicle.
The military said some 20 rockets were intercepted by the Iron Dome defense system.
Earlier on Tuesday, a pair of Israeli airstrikes targeted senior Islamic Jihad commanders in Gaza and in Syria.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.