భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనూ క్షీణించింది. 2019-20 జులై-సెప్టెంబర్ మధ్య మూడు నెలల కాలంలో 4.5 శాతానికే పరిమితమైనట్లు కేంద్రం తాజా గణాంకాల్లో వెల్లడించింది. ఇది ఆరేళ్ల కనిష్ఠస్థాయి. ఈ గణాంకాలు ఆర్థిక మాంద్యం భయాలను మరింత పెంచుతున్నాయి.
ఇంతకు ముందు 2012-13 జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ 4.3 శాతంగా నమోదైంది.
2018-19 రెండో త్రైమాసికంలో మాత్రం జీడీపీ 7 శాతంగా ఉండటం గమనార్హం.
వృద్ధి మందగిస్తున్న నేపథ్యంలో.. 2019-20 జీడీపీ అంచనాలను 6.9 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గిస్తూ రిజర్వు బ్యాంకు ఇటీవల నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే.