భారత రిటైల్ వ్యాపారాల(indian retail market value) విభాగం 2025 నాటికి ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటుతుందని వాల్‌మార్ట్ అధ్యక్షుడు, సీఈఓ డౌగ్ మెక్మిలాన్ అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయమైన మార్కెట్లలో భారత్ ఒకటని పేర్కొన్నారు. అమెరికా, చైనాల తర్వాత అతిపెద్ద మార్కెట్‌గా కూడా భారత్ ఉన్నట్లు వెల్లడించారు.
Converge@Walmart ఈవెంట్లో ఈ విషయాలు తెలిపారు మెక్మిలాన్. 'భారత మార్కెట్ వైవిద్యమైంది. కొన్ని సందర్భాల్లో దేశమంతా వివిధ ప్రత్యేకతలు కనిపిస్తాయి. కాబట్టి స్థానిక అవసరాలకు తగ్గట్లు ఆలోచించి, స్థానికంగానే వాటిని అమలు చేయాలి. వీటితో పాటు కంపెనీకి కొన్ని సొంత నిబంధనలు ఉన్నాయి. వాటన్నింటిని.. పాటిస్తూనే ముందుకు సాగుతాం,' అని వివరించారు మెక్మిలాన్.
వాల్‌మార్ట్(walmart india) అనుబంధ సంస్థలైన ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్‌పేలు సానుకూల వృద్ధితో ముందుకు సాగుతున్నాయని మెక్మిలాన్ పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో 3 లక్షలకుపైగా సెల్లర్స్, ఫోన్ పేకు 30 కోట్ల యూజర్లు ఉన్నట్లు తెలిపారు.
ఫోన్‌పే ఇటీవలే 3.6 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించగా.. కంపెనీ విలువ 38 బిలియన్ డాలర్లకు చేరింది.
ఇదీ చదవండి: LIC: ఎల్‌ఐసీలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి!