ETV Bharat / business

ప్రపంచ సహకార సంఘాల్లో 'ఇఫ్కో' నంబర్ 1

ప్రపంచవ్యాప్తంగా 300 ప్రధాన సహకార సంఘాల్లో 'ఇండియన్​ ఫార్మర్స్​ ఫర్టిలైజర్​ కోఆపరేటివ్​ లిమిటెడ్​ (ఇఫ్కో)' అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తాజాగా విడుదల చేసిన 9వ వార్షిక వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్​ (డబ్ల్యూసీఎం) నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

author img

By

Published : Jan 21, 2021, 1:45 PM IST

IFFCO Position in Cooperatives
సహకార సంఘాల్లో ఇఫ్కో అగ్ర స్థానం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహకార సంఘాల్లో.. 'ఇండియన్​ ఫార్మర్స్​ ఫర్టిలైజర్​ కోఆపరేటివ్​ లిమిటెడ్​ (ఇఫ్కో)' టర్నోవర్​ ర్యాంకు ప్రథమ స్థానానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇఫ్కో ర్యాంకు 125 నుంచి 65కు పెరగ్గా.. ఈ సారి ఏకంగా 300 ప్రధాన సహకార సంఘాల్లో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

తాజాగా విడుదల చేసిన 9వ వార్షిక వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్​ (డబ్ల్యూసీఎం) నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ రిపోర్ట్​ను ఇంటర్నేషనల్​ కోఆపరేటివ్​ అలయన్స్ (ఐసీఏ) రూపొందించింది.

స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), టర్నోవర్​ నిష్పత్తి ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ణయిస్తారు.

36 వేలకు పైగా సభ్య సహకార సంఘాల్లో దాదాపు 7 బిలియన్​ డాలర్ల గ్రూప్​ టర్నోవర్​తో 'ఇఫ్కో' అతిపెద్ద సహకార సంఘంగా నిలిచిందని ఇఫ్కో ఎండీ డాక్టర్ యూఎస్​ అవస్తీ పేర్కొన్నారు. ఇది ఇఫ్కో సహా సభ్య సంఘాలు గర్విచదగ్గ విషయమమని వివరించారు.

ఇదీ చూడండి:కొత్త బడ్జెట్​లో ఆ ఊరట లభిస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.