ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తమ వినియోగదారులకు కీలక సూచనలు చేసింది. తమ నెట్ బ్యాంకింగ్ సేవల్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు వెల్లడించింది. ఈ కారణంగా వినియోగదారులు నెట్ బ్యాంకింగ్‌లో లాగ్ఇన్ సమస్యను ఎదుర్కోవచ్చని పేర్కొంది.
'నెట్ బ్యాంకింగ్ లాగిన్‌లో సమస్యలు తలెత్తొచ్చు. కొంత సమయం తర్వాత లాగ్ఇన్ అయ్యేందుకు ప్రయత్నించండి. మొబైల్ బ్యాంకింగ్ సర్వీసుల్లో ఎలాంటి అంతరాయం లేదు.' అని ఐసీఐసీఐ బ్యంక్ పేర్కొంది.
ఇంతకు ముందు 2021 జనవరి 4న, 2020 అక్టోబర్ 16న కూడా ఐసీఐసీఐ బ్యాంక్ సేవలకు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి:ఓటీటీల్లో నెంబర్ 1 స్థానం ఎవరిది?