హ్యుందాయ్ మోటార్ ఇండియా తన 7 సీట్ల ప్రీమియం స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) అల్కజార్ డిజైన్లను మంగళవారం విడుదల చేసింది. హ్యుందాయ్ గ్లోబల్ డిజైన్ ఐడెంటిటీ ఆఫ్ సెన్సువస్ స్పోర్టీనెస్‌పై వీటిని అభివృద్ధి చేసినట్లు పేర్కొంది.
అల్కజార్ ఆర్కిటెక్చర్, స్టైలింగ్, టెక్నాలజీలు ముఖ్యమైన డిజైన్ అంశాలను ఆధునికంగా, 7-సీట్ల ఎస్‌యూవీకి తగ్గినట్లుగా ఉండేలా చేసిందని తెలిపింది. అల్కజార్ నమ్మకమైన, వైవిధ్యమైన రూపును సంతరించుకుందని, అసాధారణంగా కనిపించేందుకు దీని ప్రత్యేక డిజైన్ థీమ్ ఉపయోగపడిందని హ్యుందాయ్ పేర్కొంది.
ఇదీ చూడండి: వన్‌ప్లస్ 9 ఫోన్స్, స్మార్ట్‌వాచ్ ధరలు, ఫీచర్లు ఇవే..