ETV Bharat / business

ప్రపంచ దిగ్గజ బ్యాంకుల్లో అక్రమ నిధుల బదిలీ కలకలం

ప్రపంచ దిగ్గజ బ్యాంకులైన హెచ్ఎ​స్​బీసీ, స్టాండర్డ్ చార్టర్డ్ షేర్లు సోమవారం రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. ఈ రెండు బ్యాంకులు సహా పలు ఇతర బ్యాంకింగ్ దిగ్గజాలు గత రెండు దశాబ్దాల్లో భారీగా అక్రమ నిధుల లావాదేవీలు జరిగాయంటూ వచ్చిన వర్తాలు ఇందుకు కారణం. అనుమానిత కార్యకలాపాల నివేదికల (ఎస్‌ఏఆర్‌) నుంచి లీకైన వివరాల ఆధారంగా బజ్‌ఫీడ్‌ సహా ఇతర వార్తా సంస్థలు దీనికి సంబంధించి పలు కథనాలు రాశాయి.

HSBC, StanChart shares fall
22 ఏళ్ల కనిష్టానికి స్టాండర్డ్ చార్టర్డ్ షేర్లు
author img

By

Published : Sep 22, 2020, 11:46 AM IST

హెచ్‌ఎస్‌బీసీ, స్టాండర్డ్‌ చార్టర్డ్‌, బార్‌క్లేస్‌, డాయిష్‌ బ్యాంక్‌ లాంటి పలు దిగ్గజ బ్యాంకుల ద్వారా గత రెండు దశాబ్దాల్లో భారీగా అక్రమ నిధుల లావాదేవీలు జరిగాయంటూ వచ్చిన వార్తలు హెచ్‌ఎస్‌బీసీ, స్టాండర్డ్‌ చార్డర్డ్‌ బ్యాంకుల షేర్లను కుదిపేశాయి. ఈ రెండు బ్యాంకుల షేర్లు 1998 నాటి కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. అమెరికా ఆర్థికశాఖలోని ఫైనాన్షియల్‌ క్రైమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నెట్‌వర్క్‌ (ఫిన్‌సెన్‌) వద్ద బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సమర్పించిన అనుమానిత కార్యకలాపాల నివేదికల (ఎస్‌ఏఆర్‌) నుంచి లీకైన వివరాల ఆధారంగా బజ్‌ఫీడ్‌ సహా ఇతర వార్తా సంస్థలు కథనాలు రాశాయి. ఈ ప్రభావంతో హాంకాంగ్‌లో హెచ్‌ఎస్‌బీసీ షేరు 5 శాతం క్షీణించి 288 పెన్స్‌కు పడిపోయింది. 2009 తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి. పైగా ఈ ఏడాది ప్రారంభంలో ఉన్న స్థాయితో పోలిస్తే షేరు విలువ దాదాపు సగానికి తగ్గిపోయింది.

స్టాండర్డ్‌ చార్టర్డ్‌ షేర్లు కూడా లండన్‌ ఎక్స్ఛేంజీలో 4.6 శాతం క్షీణించి 1998 నాటి కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దాదాపు 2,100 ఎస్‌ఏఆర్‌లకు సంబంధించిన వివరాలు బజ్‌ఫీడ్‌ న్యూస్‌కు లభ్యమయ్యాయి. ఈ వివరాలను ఇంటర్నేషనల్‌ కన్షార్షియమ్‌ ఆఫ్‌ ఇన్వెస్టిగేట్‌ జర్నలిస్ట్స్‌ (ఐసీఐజే), ఇతర వార్తా సంస్థలతో బజ్‌ఫీడ్‌ పంచుకుంది.

బ్యాంకులు ఏమంటున్నాయంటే..

‘ఐసీఐజే వద్ద ఉన్న సమాచారమంతా కొత్తదేమీ కాదు. ఆర్థిక నేరాలపై చాలా ఏళ్లుగా మేం పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. ఆర్థిక నేరాల నియంత్రణ కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నాం. అన్ని రకాల చట్ట, నియంత్రణ నిబంధనలను పాటిస్తున్నాం’ అని హెచ్‌ఎస్‌బీసీ, బార్‌క్లేస్‌, డాయిష్‌ బ్యాంక్‌ తెలిపాయని ఓ ఆంగ్ల పత్రిక కథనం ఆధారంగా తెలుస్తోంది. ఎస్‌ఏఆర్‌ నివేదికల్లో చాలా వరకు డాయిష్‌ బ్యాంకుకు చెందినవే ఉన్నాయి. ఈ బ్యాంకు షేర్లు సోమవారం 5.2 % నష్టపోయాయి.

కోట్ల డాలర్లలో జరిమానాలు చెల్లించాయి..

ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలతో పాటు మనీ లాండరింగ్‌ నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు కొన్నేళ్లలో పలు బ్యాంకులు కోట్ల డాలర్లలో జరిమానాలు కట్టాయి. ఇందులో హెచ్‌ఎస్‌బీసీ, స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంకులు కూడా ఉన్నాయి.

1999 నుంచి 2017 మధ్య 2 లక్షల కోట్ల డాలర్లకు పైగా విలువైన లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఈ ఎస్‌ఏఆర్‌ల్లో ఉంది. వీటన్నింటిని కూడా అనుమానిత లావాదేవీలుగా వివిధ ఆర్థిక సంస్థల నియంత్రణ విభాగాలు గుర్తించాయి. ఫిన్‌సెన్‌ వద్ద సమర్పించిన నివేదికల్లోని వివరాలు కొంత మాత్రమే బయటకు వచ్చాయని.. చాలా నివేదికల్లో ఎక్కువ సార్లు కనిపించిన ఐదు బ్యాంకుల పేర్లలో హెచ్‌ఎస్‌బీసీ, స్టాండర్డ్‌ చార్టర్డ్‌ ఉన్ననట్లు ఐసీఐజే వెల్లడించింది.

పెట్టుబడులపై పన్ను ప్రోత్సాహకాలు ఉండే బ్రిటీష్‌ వర్జిన్‌ లాండ్స్‌ లాంటి దేశాల్లో నమోదైన కంపెనీలకు బ్యాంకులు తరచూ నిధులు తరలించాయని ఎస్‌ఏఆర్‌ల్లో ఉందని తెలిపింది. అయితే ఆ ఖాతాలు ఎవరిదో మాత్రం తెలియదని పేర్కొంది. ఈ పెద్ద లావాదేవీల వెనక ఎవరున్నారో తెలుసుకునేందుకు ప్రధాన బ్యాంకుల్లోని సిబ్బంది తరుచూ గూగుల్‌లో వెతికేవారని తెలిపింది. క్రిమినల్‌ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ అమెరికా అధికారుల నుంచి హెచ్చరికలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో బ్యాంకులు అక్రమ నిధుల బదిలీని కొనసాగించాయని తెలిపింది.

ఇదీ చూడండి:'ఆ డీల్​ కుదరకుంటే.. టిక్​టాక్ నిషేధం తప్పదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.