ETV Bharat / business

ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు కసరత్తు ముమ్మరం! - ఎయిర్​ఇండియా ప్రైవేటీకరణ వార్తలు

ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఆసక్తి వక్తీకరణ (ఈఓఐ)ని ఆహ్వానించేందుకు కేంద్రం మరో 4 రోజుల్లో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నెల 7న కేంద్ర మంత్రుల బృందం ఈఓఐ ఆహ్వానానికి ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. తదనంతర చర్యలు వేగవంతమైనట్లు తెలుస్తోంది.

AIR INDIA
ఎయిర్ ఇండియా
author img

By

Published : Jan 17, 2020, 6:32 PM IST

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్​ ఇండియా ప్రైవేటీకరణకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)ను ఆహ్వానించడానికి, వాటాల కొనుగోలు ఒప్పందం(ఎస్‌పీఏ)కి సంబంధించి మరో 4 రోజుల్లో ప్రకటన వెలువడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇటీవలే ఈఓఐకి ఆమోదం..

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో సమావేశమైన మంత్రుల బృందం ఈఓఐ, ఎస్‌పీఏకి ఈ నెల 7న ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు త్వరలోనే ప్రకటన వెలువడనున్నట్లు ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు.

2018-19 ఆర్థిక సంవత్సరానికి ఎయిర్​ ఇండియా రూ.8,556 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. మొత్తం రూ.80వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీని ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం చాలా రోజులుగా సన్నాహాలు చేస్తోంది.

ఫలించని తొలి ప్రయత్నం..

తొలుత 76 శాతం ఈక్విటీ వాటా విక్రయానికి కేంద్రం 2018లో ప్రతిపాదించగా.. ఎవరూ ముందుకు రాలేదు. ఈ కారణంగా 2019లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను తిరిగి ప్రారంభించింది. ఈసారి ఎయిర్​ ఇండియా పూర్తి వాటా విక్రయానికి ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదిలా ఉండగా.. సంస్థ సేవలను నిలిపివేస్తారని వస్తున్న వార్తలను పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి, ఎయిర్​ ఇండియా ఎండీ అశ్వనీ లోహానీ తోసిపుచ్చారు.

ఇదీ చూడండి:లక్ష కోట్ల డాలర్లకు 'ఆల్ఫాబెట్' మార్కెట్ విలువ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.