ETV Bharat / business

ఈ బ్రాండ్ల పూర్తి పేర్లు మీకు తెలుసా?

author img

By

Published : Jun 4, 2020, 8:16 AM IST

మనకు బాగా తెలిసిన ఎన్నో కంపెనీల పేర్లు చాలా వరకు సంక్షిప్తంగానే వింటుంటాము. అయితే కొన్ని కంపెనీలు పేర్లు తెలిసినా సౌలభ్యం కోసం సంక్షిప్త పదాలనే వాడుతాం. కొన్ని బ్రాండ్ల పేర్లు మాత్రం చాలా మందికి తెలియదు. అలాంటి కొన్ని బ్రాండ్ల పూర్తి పేర్లు, వాటి వివరాలు మీ కోసం.

do you know this brands full names
ఈ సంస్థల పూర్తి పేర్లు మీకు తెలుసా

నిత్యం ఎన్నో కంపెనీలు, బ్రాండ్ల పేర్లు మనం వింటూనే ఉంటాం. ఇందులో చాలా పేర్లు సంక్షిప్తంగానే ఉంటాయి. నిజానికి ఆ పేర్లే చాలా మందికి సుపరిచితం అయితే అలా సంక్షిప్తంగా ఉన్న కంపెనీల పూర్తి పేర్లు మాత్రం చాలా మందికి తెలియవు. అలా ఎక్కువ మందికి సుపరిచితమైన బ్రాండ్ల పూర్తి పేర్లు.. వాటికి సంబంధించి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డీఎల్​ఎఫ్​

డీఎల్ఎఫ్​ పూర్తి పేరు 'దిల్లీ ల్యాండ్&ఫినాన్స్'. స్థిరాస్తి రంగంలో సేవలిందిస్తున్న ఈ సంస్థను 1946లో సీహెచ్​.రాఘవేంద్ర సింగ్ స్థాపించారు. ఈ సంస్థ ప్రస్తుతం అనేక నివాస సముదాయాలు, షాపింగ్ మాల్స్, దిల్లీ, నోయిడా, గురుగ్రామ్​లలో వ్యాపార కేంద్రాలను నిర్వహిస్తోంది.

dlf
డీఎల్​ఎఫ్​

బీపీఎల్​

బీపీఎల్​ దాదాపు 10 ఏళ్ల క్రితం వరకు భారతీయ ఎలక్ట్రానిక్ బ్రాండ్లలో ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. బీపీఎల్ పూర్తి పేరు 'బ్రిటీష్​ ఫిజికల్ ల్యాబొరేటరీస్'. పేరులో బ్రిటీష్​ ఉన్నా ఇది భారతీయ కంపెనీనే. బీపీఎల్​ 1963లో స్థాపించారు. ఈ సంస్థ టీవీలకు ఒకప్పుడు విపరీతమైన డిమాండ్ ఉండేది. అయితే మార్కెట్లోకి ఎల్​జీ, శాంసంగ్​ల రాకతో బీపీఎల్​కు ఆదరణ తగ్గింది.

bpl
బీపీఎల్​

ఫీయట్ (ఎఫ్​ఐఏటీ)

కార్ల బ్రాండ్లలో ఫీయట్​కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అయితే చాలా మంది ఫీయట్ అనేదే ఈ సంస్థ పూర్తిపేరు అనుకుంటారు. కానీ అది తప్పు. ఫీయట్​ పూర్తి పేరు 'ఫాబ్రికా ఇటాలియానా ఆటోమొబిలి టొరినొ'. 1899లో స్థాపితమైన ఫీయట్ ఇటలీలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ.

FIAT
ఫీయట్

హెచ్​డీఎఫ్​సీ

బ్యాంకింగ్, ఆర్థిక సేవల్లో హెచ్​డీఎఫ్​సీ గ్రూప్​ దూసుకుపోతోంది. హెచ్​డీఎఫ్​సీ పూర్తిపేరు 'హౌసింగ్ డెవలప్​మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్​'. హెచ్​డీఎఫ్​సీని 1977లో హస్ముఖ్​భాయ్​ పరేఖ్​ స్థాపించారు.

hdfc
హెచ్​డీఎఫ్​సీ

ఐబీఎం

టెక్​ దిగ్గజాల ప్రస్తావన వచ్చిందంటే అందులో ఐబీఎం పేరు తప్పకుండా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఐబీఎం ఎంతో మందికి సుపరిచితం. ఐబీఎం పూర్తి పేరు 'ఇంటర్నేషనల్ బిజినెస్ మిషిన్స్' కార్పొరేషన్​. ఈ టెక్​ దిగ్గజాన్ని 1911లో ఛార్లెస్ రాన్​లెట్ స్థాపించారు. ఐబీఎం ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది.

ibm
ఐబీఎం

హెచ్​టీసీ

స్మార్ట్​ఫోన్​ బ్రాండ్లలో హెచ్​టీసీకీ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తైవాన్ ​కు చెందిన ఈ సంస్థ పూర్తి పేరు 'హైటెక్ కంప్యూటర్ కార్పొరేషన్'. 1997లో స్థాపితమైన ఈ సంస్థ స్మార్ట్​ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తయారు చేస్తుంది.

htc
హెచ్​టీసీ

ఐసీఐసీఐ బ్యాంక్

దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో రెండో స్థానంలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్​ పరిచయం అక్కర్లేని పేరు. అయితే చాలా మందికి ఐసీఐసీఐ పూర్తి పేరేంటో తెలియదు. ఐసీఐసీఐ అంటే 'ఇండస్ట్రీయల్ క్రెడిట్ ఇన్వెస్ట్​మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా'. ఐసీఐసీఐ బ్యాంక్​ 1994లో స్థాపితమైంది.

icici
ఐసీఐసీఐ

జేబీఎల్​

ఇయర్​​ఫోన్లు, స్పీకర్ల వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను వాడే వారికి జేబీఎల్ బ్రాండ్​ గురించి పరిచయం అక్కర్లేదు. జేబీఎల్​ పూర్తి పేరు పెద్దగా ఎవరికి తెలియదు. జేబీఎల్ పూర్తి పేరు 'జేమ్స్ బుల్లో లాన్సింగ్'. ఈ కంపెనీ అమెరికా కేంద్రంగా పని చేస్తుంది.

jbl
జేబీఎల్​

ఎల్​జీ

టీవీలు మొదలుకుని స్మార్ట్​ఫోన్లు, ఎసీలు ఇలా అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తయారు చేసే ఎల్​జీకి ప్రపంచవ్యాప్తంగా మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఎల్​జీ పూర్తి పేరు 'లక్కీ గోల్డ్​స్టార్'. ఈ సంస్థ దక్షిణ కొరియా కేంద్రంగా పని చేస్తోంది.

lg
ఎల్​జీ

అమూల్​

పాలు, పాల ఉత్పత్తులలో ఉత్తమ బ్రాండ్​గా అమూల్​కు పేరుంది. అయితే అమూల్​ అనేది ఆ సంస్థ పూర్తి పేరు కాదు. 'ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్​'ను అమూల్​గా పిలుస్తారు. అమూల్​ అంటే హిందీలో వెలకట్టలేనిది అనే అర్థం వస్తున్నందున ఇలా పిలుస్తారు. గుజరాత్​ కేంద్రంగా అమూల్ కార్యకలాపాలు సాగిస్తుంది.

amul
అమూల్

పీవీఆర్​

ఇటీవల మల్టీప్లెక్స్​లకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. మల్టీప్లెక్స్​లలో దేశవ్యాప్తంగా ఎక్కువగా వినిపించే పేర్లలో పీవీఆర్​ ముందు వరుసలో ఉంటుంది. పీవీఆర్​ పూర్తి పేరు 'ప్రియా విలేజ్​ రోడ్​ షో'. ఈ సంస్థను 1997లో స్థాపించారు.

pvr
పీవీఆర్​

ఇదీ చూడండి:కొత్త పథంలో దేశ ఎగుమతి రథం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.