అక్టోబర్లో భారత ఎగుమతులు తగ్గినట్లు అధికారిక గణాంకాల్లో వెల్లడైంది. గత నెల దేశ ఎగుమతులు 1.11 శాతం క్షీణించాయి. ఎగుమతుల మొత్తం విలువ 26.38 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిసింది. పెట్రోలియం, లెదర్ ఉత్పత్తుల ఎగుమతులు ఎక్కువగా క్షీణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
అంతకు ముందు సెప్టెంబర్లోనూ ఎగుమతులు 6.57 శాతం తగ్గి.. 26 బిలియన్ డాలర్లకు పరిమితమవ్వడం గమనార్హం. అక్టోబర్లో దిగుమతులు 16.31 శాతం తగ్గాయి. మొత్తం దిగుమతుల విలువ 37.39 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు గణాంకాల్లో తెలిసింది.
అక్టోబర్లో వాణిజ్య లోటు 11 బిలియన్ డాలర్లు పెరిగింది. గత ఏడాది ఈ లోటు 18 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఎగమతులు 2.21 శాతం తగ్గాయి. మొత్తం ఎగుమతుల విలువ 185.5 డాలర్లకు చేరింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య దిగుమతులు 8.37 శాతం క్షీణించాయి. దిగుమతుల పూర్తి విలువ 280 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడిచిన ఏడు నెలల కాలంలో వాణిజ్యలోటు 94.72 బిలియన్ డాలర్లకు చేరింది.
ఇదీ చూడండి: లండన్లో ఆస్తులు కొనే భారతీయులు 11 శాతం వృద్ధి..