హైడ్రోజన్ ఆధారంగా ప్రయాణించే విమాన తయారీపై పరిశోధనలను ఎయిర్‌బస్ ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా 200 మంది ప్రయాణికులతో 2,000 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించే విమానం డిజైన్లను సిద్ధం చేసింది. దీనిలో హైడ్రోజన్ ఆధారంగా పనిచేసేలా మార్పులు చేసిన గ్యాస్ టర్బైన్ ఇంజిన్‌ను అమర్చారు. ఇటువంటి మొత్తం మూడు డిజైన్లను సిద్ధం చేసింది. 2035 నాటికి విమానాలను ఉద్గార రహితంగా మార్చేందుకు సిద్ధం చేసిన ప్రణాళికలో భాగంగా దీనిని సిద్ధం చేస్తున్నారు.
-
So excited to have shared our #zeroe concept aircraft with you!
— Airbus (@Airbus) September 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Missed it? We’ve got you covered. Check this out 👇
But this is only the beginning. Stay tuned for more in the weeks to come!
Learn more on our website: https://t.co/rl1CcXfsiK#ZeDay #ZeroEmissionsDay pic.twitter.com/iAMkofvz9e
">So excited to have shared our #zeroe concept aircraft with you!
— Airbus (@Airbus) September 21, 2020
Missed it? We’ve got you covered. Check this out 👇
But this is only the beginning. Stay tuned for more in the weeks to come!
Learn more on our website: https://t.co/rl1CcXfsiK#ZeDay #ZeroEmissionsDay pic.twitter.com/iAMkofvz9eSo excited to have shared our #zeroe concept aircraft with you!
— Airbus (@Airbus) September 21, 2020
Missed it? We’ve got you covered. Check this out 👇
But this is only the beginning. Stay tuned for more in the weeks to come!
Learn more on our website: https://t.co/rl1CcXfsiK#ZeDay #ZeroEmissionsDay pic.twitter.com/iAMkofvz9e
ముఖ్యంగా 200 మంది పట్టే ఏ321 నియో విమానాలను ఈ సరికొత్త ఇంజిన్లతో 2,000 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతోపాటు ప్రొపెల్లర్ విమానం డిజైన్‌కూడా సిద్ధం చేశారు. దీనిలో 100 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. ఫ్లైవింగ్ కాన్సెప్ట్‌తో మరో విమానం డిజైన్ కూడా తయారు చేశారు. 2035 నాటికి తొలి ఉద్గార రహిత విమానం సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ ప్రాజెక్టుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా చేయూతనిస్తోంది.
ఇదీ చూడండి: ఆ బాక్సుతో 15 సెకెన్లలోనే కరోనా ఖతం!