ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌కు ఐరోపా సమాఖ్య (ఈయూ) 1.68 బిలియన్ డాలర్ల భారీ జరిమానాను విధించింది. ఆన్లైన్ ప్రకటనల్లో విశ్వసనీయతను దుర్వినియోగం చేసిందనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఈయూ.
ఈ అంశంలో గూగుల్‌కు ఈయూ జరిమానా విధించడం ఇది మూడో సారి. వేర్వేరు కారణాలతో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌కు గతేడాది 4.34 బిలియన్ డాలర్లు, 2017లో 2.42 బిలియన్ డాలర్ల జరిమానాను విధించింది ఐరోపా సమాఖ్య.
గూగుల్ యాడ్సెన్స్ ప్రకటనల వ్యాపారంపై... చాలాకాలంగా కొనసాగుతున్న దర్యాప్తు వివరాలను ఈయూ కాంపిటీషన్ కమిషనర్ మార్గరెట్ వెస్టాగర్ ప్రకటించారు.
''ప్రకటనల విషయంలో గూగుల్.. యాడ్సెన్స్ కాకుండా ఇతర బ్రోకర్లు వినియోగించే వెబ్సైట్లను నిలుపుదల చేసి తన విశ్వసనీయతను కోల్పోయింది.వినియోగదార్లను తప్పుదోవ పట్టిస్తూ నిబంధనల్ని ఉల్లంఘించింది.ఈ చర్యలతో ప్రకటనల వ్యాపారంలో ప్రత్యర్థులు పోటీ పడేందుకు వీలు లేకుండాగూగుల్వారిని నివారించింది. ఆత్మ రక్షణలో భాగంగా పోటీని తగ్గించుకునేందుకే గూగుల్ ఈ చర్యలకు పాల్పడిందని ఈయూ నిర్ధరించింది. '' - మార్గరెట్ వెస్టాగర్