ETV Bharat / business

మస్క్ తెలివి.. ఒక్క ట్వీట్​తో రూ.15వేల కోట్ల పన్ను ఆదా!

ఒకే ఒక్క ట్వీట్​తో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk tweets) .. సుమారు రూ.15 వేల కోట్లను ఆదా చేసుకున్నారు. చిన్న ట్వీట్​తోనే చెల్లించాల్సిన పన్నును గణనీయంగా తగ్గించుకున్నారు. అసలు ఏమైందంటే?

musk selling tesla shares
musk selling tesla shares
author img

By

Published : Nov 15, 2021, 5:52 PM IST

టెస్లా షేర్లు విక్రయించేందుకు ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ ఇటీవల ట్విట్టర్​లో నిర్వహించిన పోల్(Elon Musk twitter poll).. అందరి దృష్టినీ ఆకర్షించింది. తనకు సంస్థలో ఉన్న పదిశాతం షేర్లను విక్రయించడంపై సలహా ఇవ్వాలని కోరిన మస్క్.. ఫలితానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. పోల్​లో 57 శాతం మంది విక్రయించడానికే మొగ్గు చూపిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా షేర్ల అమ్మకాన్ని ప్రారంభించారు మస్క్.

అయితే, షేరు విలువను (Musk share in Tesla) స్పెక్యులేషన్​కు గురిచేసి మస్క్.. పన్నును ఆదా చేసుకున్నారని చాలా మంది ట్విట్టర్ యూజర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి షేర్లు (Tesla share price) అమ్మాలని గత సెప్టెంబర్ మస్క్ అనుకున్నారట. ఈ నేపథ్యంలోనే నవంబర్​లో పోల్ నిర్వహించి కంపెనీ విలువ తగ్గేలా చేశారని అంటున్నారు.

షేర్లు పతనమైన తర్వాత..

షేర్లు విక్రయించాలని మస్క్ ట్వీట్ చేసిన తర్వాత టెస్లా షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. పోల్ నిర్వహించిన తర్వాతి రోజు షేరు 4.84 శాతం పడిపోయింది. ఫలితంగా కంపెనీ విలువ 60 బిలియన్ డాలర్లు కోల్పోయింది. ఆ తర్వాతి రోజుల్లో కూడా కంపెనీ షేరు పతనమవుతూ వచ్చింది.

సరిగ్గా ఇదే సమయంలో మస్క్ తన షేర్లను విక్రయించారు. టెస్లా మార్కెట్ విలువ పడిపోగానే షేర్లు విక్రయించడం వల్ల కట్టాల్సిన పన్ను సైతం తక్కువగానే ఉంటుంది. ఈ విధంగా మస్క్.. 2 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.15 వేల కోట్లు) ఆదా చేసుకున్నారని తెలుస్తోంది.

'మీరింకా బతికున్నారనుకోలేదు'

మరోవైపు.. కుబేరులపై పన్నులు పెంచాలని డెమొక్రాట్లు చేస్తున్న ప్రతిపాదనను మస్క్ ముందునుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేస్తున్న ప్రయత్నాలపై పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో.. డెమొక్రాటిక్ నేత, సెనేటర్ బెర్నీ శాండర్స్ (Bernie Sanders Elon Musk) చేసిన ఓ ట్వీట్​కు తనదైన శైలిలో (Elon Musk tweets) సమాధానం ఇచ్చారు.

అపర కుబేరులందరూ తమ పన్నుల్లో వాటాను తప్పక కట్టేలా చూడాలని డిమాండ్ చేస్తూ బెర్నీ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మస్క్.. 'నేను మరిన్ని షేర్లు విక్రయించాలని మీరు చెబుతున్నారా?' అంటూ పేర్కొన్నారు. 'మీరింకా బతికే ఉన్నారని నేను ప్రతిసారి మర్చిపోతున్నా' అంటూ బెర్నీని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.