ETV Bharat / business

మధ్యప్రదేశ్​ గని కేసులోనూ జిందాల్​కు చిక్కులు - నవీన్​ జిందాల్

మధ్యప్రదేశ్​లోని ఉర్తాన్​ ఉత్తర బొగ్గు గని కేటాయింపు కుంభకోణం కేసుపై దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టింది. ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్​ జిందాల్​తో పాటు మరో నలుగురిపై మోసం, కుట్ర అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది.

మధ్యప్రదేశ్​ గని కేసులోనూ జిందాల్​కు చిక్కులు
author img

By

Published : Jul 1, 2019, 3:35 PM IST

ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్​ జిందాల్​తో పాటు మరో నలుగురిపై మోసం, కుట్ర అభియోగాలు​ మోపాలని ఆదేశించింది దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం.

మధ్యప్రదేశ్​లోని ఉర్తాన్​ ఉత్తర బొగ్గు గని కేటాయింపు కుంభకోణం కేసుపై విచారణ చేపట్టారు ప్రత్యేక న్యాయమూర్తి భరత్​ పరాశర్​. నవీన్​ జిందాల్​ సహా నలుగురిపై భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్​ 420(మోసం), సెక్షన్​ 120-బి (కుట్ర) అభియోగాలు​ నమోదు చేయాలని ఆదేశించారు. విచారణను ఈనెల 25కు వాయిదా వేశారు.

ఆ నలుగురిలో...

జిందాల్​ స్టీల్​, పవర్​ లిమిటెడ్​ సంస్థ మాజీ డైరెక్టర్​ సుశీల్​ మరూ, మాజీ డిప్యూటీ ఎండీ ఆనంద్​ గోయల్​, ముఖ్య కార్యనిర్వాహణ అధికారి విక్రాంత్​ గుజ్రాల్​, సంస్థ అధికార ప్రతినిధి డీఎన్​ అబ్రోల్​పై జిందాల్​తోపాటు అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు ఆదేశించింది.

అలా వెలుగులోకి...

2009లో ఝార్ఖండ్​లోని అమర్కొండ ముర్గదంగల్​ బొగ్గు గని కేటాయింపులో అవకతవకలపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, అప్పటి బొగ్గు శాఖ సహాయ మంత్రి దాసరి నారాయణ రావులతో పాటు నవీన్​ జిందాల్​ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అభియోగ పత్రం దాఖలు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ... మధ్యప్రదేశ్​ ఉర్తాన్​ గని వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. నిందితులు మధ్యప్రదేశ్​ బొగ్గ గని పొందడానికి స్క్రీనింగ్​ కమిటీకి 2007లో సమర్పించిన దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చారని అభియోగపత్రం​లో పేర్కొంది. అక్రమ లాభార్జన కోసం బొగ్గు శాఖను మోసం చేశారని తెలిపింది.

ఇదీ చూడండి: పీఓకే, గిల్గిత్​పై వ్యాజ్యం- పిటిషనర్​కు జరిమానా

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.