ETV Bharat / business

కరోనాపై పోరులో భారత్‌కు అండగా అమెరికా కంపెనీలు! - భారత్​ కోసం 40 అమెరికా కంపకెనీల టాస్క్ ఫోర్స్

కొవిడ్ రెండో దశ వల్ల తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న భారత్​కు సాయం చేసేందుకు కార్పొరేట్ సంస్థలు మందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా 40 అమెరికా కార్పొరేట్ సంస్థలు టాస్క్​ ఫోర్స్​గా ఏర్పడ్డాయి. ఓ దేశంలో నెలకొన్న ఆరోగ్య సంక్షోభాన్ని రూపుమాపేందుకు అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్‌ వర్గాలు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పడడం ఇదే తొలిసారి కావడం విశేషం.

US companies to help India
భారత్​కు అమెరికా కంపెనీల సాయం
author img

By

Published : Apr 27, 2021, 12:12 PM IST

కరోనా విలయానికి తల్లడిల్లుతున్న భారతావనికి అండగా నిలిచేందుకు యావత్తు ప్రపంచం ముందుకు వస్తోంది. ఇప్పటికే పలు దేశాలు తమ సాయాన్ని ప్రకటించగా.. తాజాగా అమెరికాలోని వాణిజ్య వర్గాలు ఏకమయ్యాయి. అగ్రరాజ్యంలో పేరెన్నికగన్న దాదాపు 40 కంపెనీలు ఏకతాటిపైకి వచ్చాయి. ఓ కార్యదళంగా ఏర్పడి భారత్‌కు కావాల్సిన సహకారం అందించాలని నిర్ణయించాయి.

20 వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు

ఈ క్రతువును ‘యూఎస్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ యూఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’, ‘యూఎస్‌-ఇండియా స్ట్రాటజిక్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫోరం’, ‘బిజినెస్‌ రౌండ్‌టేబుల్‌’ వంటి వాణిజ్య సంఘాలు స్వయంగా పర్యవేక్షించనున్నాయి. సోమవారం ఈ మేరకు సమావేశం జరిగింది. రానున్న కొన్ని వారాల్లో దాదాపు 20 వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను భారత్‌కు పంపాలని నిర్ణయించినట్లు డెలాయిట్‌ సీఈఓ పునీత్‌ రెంజెన్‌ తెలిపారు.

ఇదే తొలిసారి..

రానున్న రోజుల్లో కీలక వైద్య పరికరాలు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్‌ సహా ఇతర కీలక సరఫరాలను భారత్‌ అందజేయనున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ వర్గాలు తెలిపాయి. ఓ దేశంలో నెలకొన్న ఆరోగ్య సంక్షోభాన్ని రూపుమాపేందుకు అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్‌ వర్గాలు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పడడం ఇదే తొలిసారని అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ అభిప్రాయపడ్డారు.

సాధ్యమైన మార్గంలో వీలైనంత మేర భారత్‌కు సాయం చేసేందుకు అమెరికా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని పునీత్‌ రెంజెన్‌ తెలిపారు. ఈ వారం మధ్యలో భారత్‌కు 1000 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు చేరనున్నట్లు వెల్లడించారు. మే 5 నాటికి ఆ సంఖ్య 11,000 చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం 25 వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అవసరమైతే అంతకు మించే పంపుతామని హామీ ఇచ్చారు. తర్వాతి దశలో 10 లీటర్లు, 45 లీటర్ల ఆక్సిజన్‌ సిలిండర్లు, ఇతర మానిటరింగ్‌ కిట్లు పంపుతామన్నారు.

అన్ని రంగాల భాగస్వామ్యం..

తాజాగా ఏర్పడిన టాస్క్‌ఫోర్స్‌లో ఈ-కామర్స్‌, రిటైల్‌, ఫార్మా, టెక్‌, తయారీ రంగాల పరిశ్రమలు భాగస్వామ్యం అయ్యాయి. అమెరికాలోని భారత రాయబారి తరంజిత్‌ సింగ్‌ సంధుతో ఈ టాస్క్‌ఫోర్స్‌ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఆయన ఇప్పటికే భారత్‌కు కావాల్సిన కీలక పరికరాల జాబితాను వారికి అందజేశారు. త్వరలోనే భారత్‌ ఈ సంక్షోభం నుంచి గట్టెక్కుతుందని టాస్క్‌ఫోర్స్‌ తరఫున పునీత్‌ రంజన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:'కరోనా 2.O వల్ల రెండంకెల వృద్ధి రేటు కష్టమే!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.