ETV Bharat / business

30 కోట్ల డోసులకు రూ.1500 కోట్లు- కేంద్రం ఒప్పందం

బయోలాజికల్‌ ఈ.లిమిటెడ్‌ (బీఈ)తో 30 కోట్ల కరోనా టీకా(Covid Vaccine) డోసుల కొనుగోలుకోసం రూ.1500 కోట్లను అడ్వాన్స్​గా చెల్లించేందుకు సిద్ధమైంది కేంద్రం. ఈ ఏడాది ఆగస్టు- డిసెంబర్​ మధ్య బిఈ 30 కోట్ల డోసులను ఉత్పత్తి చేయొచ్చని సమాచారం. హైదరాబాద్​ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ అమెరికాకు చెందిన బేలార్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో సంయుక్తంగా టీకా ఉత్పత్తికి కృషి చేస్తోంది.

30 Cr vaccine Doses form Biological E
కేంద్రాన్ని నిధులు కోరిన బిఈ
author img

By

Published : Jun 3, 2021, 10:54 AM IST

కరోనా టీకా అభివృద్ధికి కృషి చేస్తున్న బయోలాజికల్‌ ఈ.లిమిటెడ్‌ (బీఈ)కు రూ.1,500 కోట్లు అడ్వాన్స్​గా చెల్లించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఈ.లిమిటెడ్‌ (బిఈ) కొవిడ్‌-19 టీకాలను (Covid Vaccine) పెద్దఎత్తున ఉత్పత్తి చేయడానికి.. తమకు అడ్వాన్స్‌గా రూ.1500 కోట్లు విడుదల చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవల కోరింది. ఇందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. రూ.1,500 కోట్లను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు-డిసెంబర్ మధ్య 30 కోట్ల టీకా డోసులను అందించేందుకుగాను బీఈ ఈ నిధులను కోరడం గమనార్హం.

దేశంలో టీకాలను అధికంగా ఉత్పత్తి చేసేందుకు కంపెనీలను ప్రోత్సహించాలని, ఆయా సంస్థలకు ఆర్థికంగా అండదండలు అందించాలని ప్రభుత్వం కొంతకాలం క్రితమే నిర్ణయించింది. ఇందులో భాగంగానే బయోలాజికల్‌ ఈ.లిమిటెడ్​కు ఈ స్థాయిలో నిధులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

అమెరికా సంస్థతో కలిసి..

అమెరికాకు చెందిన బేలార్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో కలిసి బయోలాజికల్‌ ఈ.లిమిటెడ్‌ కొవిడ్‌-19 టీకాను ఆవిష్కరించే పనిలో ఉంది. దీనిపై మనదేశంలో రెండు- మూడు దశల క్లినికల్‌ పరీక్షలు నిర్వహించేందుకు నెల క్రితం సెంట్రల్‌ డ్రగ్స్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ) అనుమతి పొందింది. ఇదే కాకుండా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ అభివృద్ధి చేసిన టీకాను(Covid Vaccine) మనదేశంలో ఉత్పత్తి చేయడానికీ, ఆ సంస్థతో బయోలాజికల్‌ ఈ.లిమిటెడ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. కెనడా సంస్థ ప్రావిడెన్స్‌ థెరప్యూటిక్స్‌కు చెందిన ఎంఆర్‌ఎన్‌ఏ టీకాను మనదేశానికి తీసుకురావడానికి, ఆ టీకాను ఇక్కడ ఉత్పత్తి చేయడానికి కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రావిడెన్స్‌ థెరప్యూటిక్స్‌కు చెందిన ఎంఆర్‌ఎన్‌ఏ టీకాను మనదేశంలో వచ్చే ఏడాదిలో 60-100 కోట్ల డోసుల వరకు తయారు చేయాలనేది బయోలాజికల్‌ ఈ.లిమిటెడ్‌ లక్ష్యం. ఈ ఉత్పత్తి ప్రణాళికలకు అనుగుణంగా తగినంత మేరకు నిధులు సమకూర్చుకోవలసిన అవసరం కంపెనీకి ఉంది.

ఇప్పటికే ఈ సంస్థలకు

మనదేశంలో అత్యవసర అనుమతి ఉన్న కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలను(Covid Vaccine) ఉత్పత్తి చేస్తున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ), భారత్‌ బయోటెక్‌లకు, కేంద్ర ప్రభుత్వం 'అడ్వాన్సు'గా కొంతమేరకు నిధులు అందించింది. ప్రభుత్వం చేపట్టిన టీకాల కార్యక్రమానికి ఈ సంస్థలు పెద్దఎత్తున టీకాలు సరఫరా చేస్తున్నాయి. అందుకే ఈ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బయోలాజికల్‌ ఈ.లిమిటెడ్‌ టీకాలు ప్రస్తుతం క్లినికల్‌ పరీక్షల తుది దశలో ఉన్నాయి. ఆ తర్వాత భారత ఔషధ నియంత్రణ మండలి నుంచి 'అత్యవసర అనుమతి' పొందాలి. ఆ తర్వాతే టీకాల ఉత్పత్తి, పంపిణీ సాధ్యమవుతుంది. ఈ పనులన్నీ నాలుగైదు నెలల్లో పూర్తవుతాయని, తదుపరి టీకాల ఉత్పత్తి ప్రారంభించి పెద్దఎత్తున దేశీయ మార్కెట్‌కు, ఇతర దేశాలకు సరఫరా చేయాలని బయోలాజికల్‌ ఈ.లిమిటెడ్‌ భావిస్తోంది. దేశీయ అవసరాలకు సైతం టీకాలు అందించడానికి సిద్ధపడుతున్నందున ప్రభుత్వం నుంచి ఈ సంస్థకు చేయూత లభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదీ చదవండి:టీకాలు అందకుంటే కొవిడ్‌ మూడో దశా తీవ్రమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.