ETV Bharat / business

'హరిత పన్ను, తుక్కు విధానంతో ఇద్దరికీ లాభం' - ఫాడా అధ్యక్షుడు తాజా వార్తలు

హరిత పన్ను, స్వచ్ఛంద తుక్కు విధానం, పీఎల్​ఐతో అటు వినియోగదారులకు ఇటు ఆటోమొబైల్​ రంగానికి ఇద్దరికీ లబ్ధి చేకూరనుందని ఫాడా అధ్యక్షుడు వింకేశ్​ గులాటీ అన్నారు. 'ఈటీవీ భారత్'​కు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన మరిన్ని విషయాలను వెల్లడించారు.

Carrot and stick approach
'హరిత పన్ను, తుక్కు విధానంతో ఇద్దరికీ లాభం'
author img

By

Published : Feb 6, 2021, 6:12 PM IST

ఇటీవల కేంద్ర బడ్జెట్​లో ప్రకటించిన హరిత పన్ను, స్వచ్ఛంద తుక్కు విధానంతో ఆటోమొబైల్​ రంగానికి లబ్ధి చేకూరనుందని ఆటోమొబైల్‌ డీలర్ల సమాఖ్య (ఫాడా) అధ్యక్షుడు వింకేశ్​ గులాటీ అన్నారు. వినియోగదారులు తమ వద్ద ఉన్న పనిచేయని, పాత వాహనాలను సురక్షితమైన, పర్యావరణ హితమైన కొత్త వాటితో భర్తీ చేసుకునేందుకు ఇది మంచి అవకాశమన్నారు. వీటితో పాటు 'ఈటీవీ భారత్'​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో మరిన్ని విషయాలను పంచుకున్నారు.

ఫాడా అధ్యక్షుడితో ముఖాముఖి

ఈ హరిత పన్ను, తుక్కు విధానం.. 'క్యారెట్​ అండ్​ స్టిక్​' పాలసీలా ఉందని, ఇది వినియోగదారులకు, ఆటోమొబైల్​ రంగానికి ఇద్దరికీ ఉపయోగకరమన్నారు.

"మాకున్న అనుభవం ప్రకారం ప్రజలు మొదటి ఐదు సంవత్సరాలే వారి వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాహనాలను సరిగా చూసుకోకపోతే అవి కాలుష్య కారకాలుగా మారతాయి. తద్వారా వాహన సమర్థత తగ్గిపోతుంది. 20 ఏళ్ల క్రితం కొన్న వాహనానికి ఇప్పుడు వస్తున్న కొత్త బండ్లకు భద్రతా అంశాల్లో చాలా తేడా ఉంటుంది.

అందుకే ఫాడా.. క్యారట్​ అండ్​ స్టిక్​ పాలసీని అమలు చేయాలని చూస్తోంది. మీరు పాత వాహనాన్నే నడపాలనుకుంటే హరిత పన్ను కట్టండి. లేకుంటే కొత్త వాటితో భర్తీ చేసుకుని, పాత వాటిని తుక్కుగా మార్చుకోండి."

- వింకేశ్​ గులాటీ, ఫాడా అధ్యక్షుడు

కేంద్రం చెప్పిన హరిత పన్ను వివరాలు..

  • 15 సంవత్సరాలు దాటిన వ్యక్తిగత వాహనదారులు.. వాహన స్థాయి మేరకు రోడ్‌ టాక్స్‌లో పది నుంచి 25 శాతం పన్ను చెల్లించాలి. ఏ మొత్తంలో వసూలు చేయాలో ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
  • 8 సంవత్సరాలు దాటిన రవాణా వాహనాలకు స్థాయి ఆధారంగా వాహన ధ్రువపత్రం తీసుకునే సమయంలో రహదారి(త్రైమాసిక) పన్నులో 10 నుంచి 25 శాతం వసూలు చేయాలి. (దీని ప్రకారం వాణిజ్య వాహనాలపై రూ.ఏడు వేల నుంచి రూ.15 వేల వరకు ఏటా భారం పడుతుందన్నది అంచనా.)
  • ప్రజా రవాణాకు ఉపయోగించే సిటీ బస్సులకు తక్కువ మొత్తంలో పన్ను వసూలు చేయాలి.
  • భారీగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న రాష్ట్రాల్లో హరిత పన్నును 50 శాతం వసూలు చేయాలి.
  • విద్యుత్తు, హైబ్రీడ్‌, సీఎన్జీ, ఎల్పీజీ, ఇథనాల్‌తో నడిచే వాహనాలను, వ్యవసాయ పనులకు వినియోగించే వాహనాలను హరిత పన్ను నుంచి మినహాయించింది.
  • వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 15 సంవత్సరాలు దాటిన ప్రభుత్వ, ప్రభుత్వ రంగం సంస్థల వాహనాలను తుక్కు కింద మార్చాలి.

బండి పరిస్థితిని ఎలా అంచనా వేస్తారు?

ఒక్కొక్కరు వాహనాన్ని ఒక్కో రీతిలో వినియోగిస్తారు. బండి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిందో చూస్తే వాహనాన్ని ఎంతమేరకు వినియోగించారో తెలుస్తుందని కొంత మంది ఆటోమొబైల్​ నిపుణలు చెప్తారు.

"బండి నాణ్యత తెలియాలంటే అది కొని ఎన్నాళ్లు అయిందో చూడాలి. ఉదాహరణకు 15 ఏళ్ల క్రితం ఓ వాహనం కొనుగోలు చేస్తే.. అది బీఎస్​ జీరో స్టాండర్డ్​కు చెందినదై ఉంటుంది. ఇవి పర్యావరణహితం కాదు. ఇవి 10 వేల కిలోమీటర్లే ప్రయాణించినా వాటి నుంచి వచ్చే కాలుష్యం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఒక వేళ ఏమైనా ప్రమాదం జరిగి వాహనం స్పీడో మీటర్​ను మారిస్తే ఆ బండి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిందో చెప్పడం కష్టం."

- వింకేశ్​ గులాటీ

ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) పథకం..

"ప్రస్తుతం రవాణా వాహనాల ఉత్పత్తి డిమాండ్​కు తగ్గట్లు లేదు. సెమీకండక్టర్లు దొరకకపోవడం ఇందుకు ఒక కారణం. మనం దిగుమతులపై ఆధాపరడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. పీఎల్​ఐ ఈ పరిస్థితిని మార్చే అవకాశం ఉంది.

దేశీయ తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు గత ఏడాది నవంబర్​లో ఆటోమొబైల్​ రంగాన్ని పీఎల్ఐ పథకం కిందకు తెచ్చింది సర్కార్. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రభుత్వం ఐదేళ్లలో రూ.57 వేల కోట్లు ఆటోమొబైల్​ రంగానికి ఈ పథకం కింద ఖర్చు చేయాల్సి ఉంది. అలా జరిగితే భారత్​ ప్రస్తుత పరిస్థితి కన్నా తయారీ రంగంలో మెరుగయ్యే అవకాశం ఉంది. పీఎల్​ఐ కచ్చితంగా ఉపయోగకరం."

- వింకేశ్​ గులాటీ

(శ్రవణ్​ నూనె, బిజినెస్​ ఎడిటర్​, ఈటీవీ భారత్)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.