ETV Bharat / business

ఎయిర్​టెల్ దూకుడు- షేర్లు 13% జంప్

టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్​టెల్ స్టాక్​ మార్కెట్​లో దూకుడు ప్రదర్శిస్తోంది. 2020-21 క్యూ2 ఫలితాల సానుకూలతలతో సంస్థ షేర్లు 13 శాతం వరకు లాభాలను నమోదు చేశాయి. 30 షేర్ల ఇండెక్స్, నిఫ్టీ-50లో ఎయిర్​టెల్ అగ్రస్థానంలో ఉంది.

AIRTE SHARES ZOOM AFTER POSITIVE Q2 RESUTLS
భారీగా పుంజుకున్న ఎయిర్​టెల్ షేర్లు
author img

By

Published : Oct 28, 2020, 12:19 PM IST

స్టాక్ మార్కెట్లలో భారతీ ఎయిర్​టెల్ షేర్లు జోరు కనబరుస్తున్నాయి. బుధవారం సెషన్​లో 13 శాతం వరకు పుంజుకున్నాయి.

బీఎస్​ఈలో భారతీ ఎయిర్​టెల్ షేరు ప్రస్తుతం 12.65 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఒక్కో షేరు విలువ రూ.487.80 వద్ద ఉంది.

ఎన్​ఎస్​ఈలో 12.61 శాతం పెరిగిన భారతీ ఎయిర్​టెల్ షేరు విలువ రూ.488గా ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 22 శాతం పెరిగి రికార్డు స్థాయి వద్ద రూ.25,785 కోట్లుగా నమోదైనట్లు ఎయిర్​టెల్ మంగళవారం ప్రకటించింది. సంస్థ నికర నష్టం రూ.763 కోట్లకు పరిమితమైందని తెలిపింది. ఈ సానుకూలతల నేపథ్యంలోనే షేర్లు ఈ స్థాయిలో పుంజుకుంటున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.