డిజిటల్ లావాలేవీల సంస్థ భారత్‌పే.. తన వినియోగదారులకు రెండు సరికొత్త ఫీచర్లలను సోమవారం అందుబాటులోకి తెచ్చింది. కరోనా కాలంలో వాయిస్ ఆధారిత సేవల లావాదేవీలతో పాటు బ్యాలెన్స్ చూసుకునే అవకాశాన్ని కల్పించింది.
పైసా బోలేగా.. క్యూఆర్ కోడ్ ద్వారా లావాదేవీలు చేసినప్పుడు వ్యాపారులకు వాయిస్ నోటిఫికేషన్ వస్తుంది. డబ్బు ఎంత చెల్లించారన్న విషయాన్ని దుకాణదారుడికి స్మార్ట్ ఫోన్ స్పీకర్ ద్వారా తెలియజేస్తుంది.
భారత్‌పే బ్యాలెన్స్.. దుకాణదారుడి ఖాతాలో మొత్తాన్ని ఎప్పటికప్పుడు చూసుకునే వీలు కల్పించింది. డిపాజిట్లు, రుణాలు, క్యూఆర్ ద్వారా జరిగిన రోజువారీ చెల్లింపులను పరిశీలించుకోవచ్చు.
పెరిగిన వ్యాపారం..
ఈ రెండు ఫీచర్లతో దుకాణదారుడు తరచూ ఫోన్ చూసుకునే అవసరం లేదని సంస్థ తెలిపింది. వీటితో పాటు రోజువారీ లావాదేవీలకు సంబంధించి జాబితాను రూపొందిస్తుంది. ఈ సదుపాయాలన్నీ ఉచితంగా కల్పిస్తున్నట్లు తెలిపారు భారత్‌పే సీఈఓ అష్నీర్ గ్రోవర్.
కరోనా లాక్డౌన్ వేళ డిజిటల్ పేమెంట్లకే మొగ్గుచూపుతున్న కారణంగా భారత్‌పే వ్యాపారం పెరిగింది. ఒక దుకాణదారుడిపై సగటు 70 ఆదాయం పెరిగినట్లు తెలిపింది.