ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి నిరసనగా నాలుగు బ్యాంకింగ్ సంఘాలు రెండు రోజులు విధులు బహిష్కరించనున్నట్టు ప్రకటించాయి. సెప్టెంబర్ 26 నుంచి 27 వరకు సమ్మె కొనసాగుతుందని బ్యాంకింగ్ సంఘాలు తెలిపాయి. ఈ మేరకు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ , ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ సంఘాలు సమ్మె నోటీసులిచ్చాయి.
నోటీసుల్లో పేర్కొన్న డిమాండ్లు ఇవే..
- బ్యాంకుల విలీనం ఉపసంహరణ
- సత్వర వేతన సవరణ
- వారానికి ఐదురోజుల పనిదినాల అమలు
- విజిలెన్స్ కేసుల్లో బయటి సంస్థల జోక్యాన్ని నిలిపివేయడం
- ఎన్పీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం అమలు
- సేవా ఛార్జీలు తగ్గింపు
ఈ డిమాడ్లపై కేంద్రం స్పందించకపోతే నవంబర్ రెండవ వారం నుంచి దేశంలోని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు నిరవధిక సమ్మెకు దిగుతాయని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.
ఇదీ చూడండి: 'చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం' వృద్ధి