స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ తన బడ్జెట్ రేంజ్ ఐఫోన్ 'ఎస్ఈ 2020'ను ఆవిష్కరించింది. 2016లో విడుదలైన ఐఫోన్ ఎస్ఈకి అప్డేట్ వెర్షన్‌గా 'ఎస్ఈ 2020' వస్తోంది.
మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు బడ్జెట్ ఫోన్లపై దృష్టి పెట్టింది యాపిల్. ఇందుకోసం మూడేళ్ల క్రితం ఐఫోన్ ఎస్ఈని విడుదల చేసింది. చిన్న సైజులో ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. ప్రస్తుతం విడుదల చేసిన ఎస్ఈ-2020లోనూ అధునాతన ఫీచర్లను జోడించింది యాపిల్.
మూడు వేరియంట్లలో..
ఈ ఫోన్‌ను 64జీబీ, 128జీబీ, 256జీబీ స్టోరేజీ వేరియంట్ల రూపంలో అందిస్తోంది యాపిల్. నలుపు, ఎరుపు, తెలుపు రంగుల్లోనూ లభించనుంది. అయితే ఐఫోన్ X తో టచ్ ఐడీకి ముగింపు పలికిన యాపిల్.. మళ్లీ ఎస్ఈలో ఈ సౌకర్యాన్ని కల్పించింది.
వాటర్ రెసిస్టెంట్..
ఇందులో ఐఫోన్ 11, 11 ప్రో, 11ప్రో మ్యాక్స్‌లో వాడిన అధునాతన ఏ13 బయోనిక్ చిప్‌ను అమర్చింది యాపిల్. అంతేకాకుండా ఐపీ67 గుర్తింపు ఉన్న వాటర్, డస్ట్ రెసిస్టెంట్ సదుపాయం కల్పించింది.
మరిన్ని ప్రత్యేకతలు
- 4.7 అంగుళాల ఎల్సీడీ తెర
- 3 జీబీ ర్యామ్
- వెనుక కెమెరా 12 ఎంపీ (5x జూమ్, 6 పొట్రెయిట్ మోడ్స్, అడ్వాన్స్డ్ బొకె, డెప్త్ కంట్రోల్ ఫీచర్లు)
- 4కే వీడియో సపోర్ట్
- ముందు కెమెరా 7 ఎంపీ
- బ్లూటూత్ 5.0
- ప్రారంభ ధర (అమెరికా) 399 డాలర్లు
అయితే భారత్‌లో ఈ ఫోన్ ఎప్పటి నుంచి లభిస్తుందనే సమాచారాన్ని యాపిల్ వెల్లడించలేదు. అధికారిక సమాచారం ప్రకారం భారత్‌లో ప్రాథమిక వేరియంట్ ధర రూ.42,500 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది యాపిల్.
ఇదీ చూడండి: లాక్డౌన్ ఉన్నా కొత్త కారు కొనుక్కోండిలా...